ఆస్ట్రేలియాకు చెందిన క్రికెట్ ప్లేయర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇటీవల ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టీంకు ఆడిన సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్‌లో మ్యాక్స్‌వెల్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. రూ.10 కోట్లు ఖర్చు పెట్టి టీం అతన్ని తీసుకున్నా.. అతను సరిగ్గా ఆడలేదు. కానీ భారత్‌తో ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌లో విజృంభించి ఆడాడు. ఆ టీం సిరీస్ గెలుచుకునేందుకు ఒక రకంగా మ్యాక్స్‌వెల్ కూడా కారణమయ్యాడు. అయితే దీనిపై పంజాబ్ టీం సలహదారుడు, మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. మ్యాక్స్‌వెల్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
మ్యాక్స్‌వెల్ పంజాబ్‌కు సరిగ్గా ఆడడని, అదే తమ సొంత జట్టు ఆస్ట్రేలియాకు అయితేనే బాగా ఆడుతాడని సెహ్వాగ్ అన్నాడు. ఐపీఎల్‌లో కేవలం ఎంజాయ్ చేసేందుకే మ్యాక్స్‌వెల్ వచ్చాడని, అతను ఐపీఎల్‌లో మ్యాచ్ ఆడడం తప్ప ఏమైనా చేస్తాడని సెహ్వాడ్ అన్నాడు. మ్యాక్స్ వెల్ ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తాడని, అటు ఇటు తిరుగుతుంటాడని, డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తాడని, మ్యాచ్ ముగిశాక ఇచ్చే ఉచిత డ్రింక్స్ ను తీసుకుని గదికి వెళ్లి డ్రింక్స్ మీద డ్రింక్స్ తాగుతాడని అన్నాడు. అదే అతను ఆస్ట్రేలియాకు ఆడుతున్నప్పుడు అతని యాటిట్యూడ్ పూర్తిగా మారిపోతుందని, జట్టు కోసం నికార్సయిన ఆటగాడిగా మ్యాచ్‌లో ఆడతాడని సెహ్వాగ్ అన్నాడు.
అయితే సెహ్వాగ్ చేసిన కామెంట్లను మ్యాక్స్‌వెల్ తెలుసుకున్నాడో లేదో కానీ.. అందుకు సమాధానం అయితే ఇవ్వలేదు. కానీ రూ.10 కోట్లు తీసుకున్నప్పుడు పంజాబ్ టీంకు ఆ స్థాయిలో ఆడాలి కదా. కానీ అలా కాకుండా పంజాబ్ కు చెత్త ప్రదర్శన ఇచ్చి, ఆస్ట్రేలియాకు బాగా ఆడడం ఎంత వరకు కరెక్ట్ అని కొందరు మ్యాక్స్‌వెల్ ను ప్రశ్నించారు. అయితే సెహ్వాగ్ మరీ అంత కఠిమైన వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదని కొందరు అంటున్నారు. అవును మరి.. కొందరు ప్లేయర్లు అయితే ఐపీఎల్‌లోనే ఆడుతారు, తమ సొంత జట్లకు ఆడరు. కానీ మ్యాక్స్‌వెల్ అందుకు రివర్స్ గా ఉన్నాడు. ఎంతైనా ఐపీఎల్ లాంటి లీగ్‌ల కన్నా సొంత దేశాల జట్లకు ఆడితేనే ఎక్కువగా పేరు వస్తుంది కదా, మ్యాక్స్ వెల్ కూడా అదే చేస్తున్నాడేమో..!