మన దేశంలో దేవాలయాలకు ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుంది. దేవాలయాలకు సంబంధించి ఆచారాలు, సాంప్రదాయాలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక దేవాలయాలకు దగ్గరలో ఇల్లు కట్టుకోవడం మంచిది కాదని చెప్తూ ఉంటారు. అసలు అది ఎంత వరకు నిజం ఏంటీ అనేది చూద్దాం. మనం ఎక్కువగా… శివాలయం ఎదురుగానూ , విష్ణువు. ఆలయాల వెనుకవైపునా ఇళ్ళు కట్టుకోగూడదు అని చెప్తారు.
Also Read:ఇంటి పక్కన చింత చెట్టు ఎందుకు ఉండకూడదు…?
అసలు కారణం… పూర్వకాలం లో దేవాలయం దగ్గర ఇళ్ళు వుంటే దేవాలయం యొక్క పవిత్రమైన వాతావరణానికి ఇబ్బందిగా ఉంటుందేమోనని దూరంగా కట్టుకోమని చెప్పే వారు. అలాగే దేవాలయానికి వచ్చే భక్తులు గంట కొట్టడం, దేవుని ఆరాధన చేయడం అలాగే ఎక్కువ మంది వస్తే శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉండటంతో గుడి దగ్గరగా ఉండే వాళ్లకు ఇబ్బందయ్యే అవకాశం ఉంటుంది.
అందుకే కొంచెం దూరంగా ఇళ్ళు కట్టుకోమని సలహా ఇచ్చారు. ఆ విధంగా చెప్తే వినే వాళ్ళు ఉండరని ఇలా నీడపడకూడదని చెప్పారు. ఇక మరో కారణం కూడా ఉంది. దేవాలయం దగ్గర్లో ఇళ్ళు వుంటే అక్కడ మన వంటలూ మొదలైన కార్యక్రమాలు చేసి… దేవాలయం వాతావరణం కలుషితం చేస్తాయని దూరంగా ఉండమని చెప్పే వాళ్ళు. చాలా మంది అర్చకుల నివాసాలు ఇప్పటికీ గుడికి ఆనుకునే ఉంటాయి. ఇక వాటర్ ట్యాంక్ విషయంలో కూడా ఇలాంటి నిబంధన ఉండేది. దానికి కారణం… నీళ్ళతో ఉండే ట్యాంక్ ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉండవచ్చు అనే భయంతో ఇంటి నీడ పడకూడదు అని చెప్పే వారు.
Also Read:కేసీఆర్ ఢిల్లీ టూర్ పై షర్మిల సెటైర్లు