ఈ రోజుల్లో డ్రై ఫ్రూట్స్ కి డిమాండ్ కాస్త పెరుగుతుంది. వాటిల్లో ఉండే పోషక విలువల కారణంగా చాలా మంది డ్రై ఫ్రూట్స్ ని ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా బాదం పప్పుకి మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నా సరే నీళ్ళల్లో నానబెట్టిన బాదం పప్పుని ఏదోక సమయంలో తీసుకుంటున్నారు. అసలు నానబెట్టి ఎందుకు తినాలి…? తినడం వలన వచ్చే ప్రయోజనాలు ఏంటో చూద్దాం.
Also Read:రాహుల్ గాంధీ, ప్రియాంక అరెస్టు… ఢిల్లీలో ఉద్రిక్తత…!
బాదంపప్పు 5–6 గింజలు రోజూ రాత్రి సమయంలో ఒక చిన్న గ్లాసులో నీళ్లలో నానబెట్టి వాటిని ఉదయం తినడం మంచిది. అలా నానబెట్టడంతో… తొక్క తేలికగా ఒలవబడటమే కాకుండా లోపల ఉండే ప్రొటీన్లు పదిలంగా ఉండి నమలడానికి తేలికగా ఉంటాయి. 6 గంటలు పైబడి నానిన బాదంగింజపై తొక్క ఒలిచిన వెంటనే… తేలికగా వచ్చేస్తుంది. నీటిలో నాని ఉండటంతో ఎవరైనా సరే ఈజీగా తినవచ్చు.
ఇలా తినడం వలన రక్తంలో కొలెస్ట్రాల్, బిపి, డయాబెటిస్ వంటివి అదుపులో ఉంటాయని వైద్యులు చెప్తున్నారు. ఇక మన శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి. కిడ్నీలో రాళ్లవంటి సమస్యలు రాకుండా కూడా సహకరిస్తాయి. జీర్ణ ప్రక్రియలో కూడా ఇలా తినడం సహాయపడుతుంది. కానీ మితంగా ఐదు లేక ఆరు గింజలు మించకుండా తినడం మంచిది. అతిగా సేవిస్తే డయేరియా వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది