విమాన ప్రయాణ ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రావడంతో ఇప్పుడు చాలా మంది విమాన ప్రయాణాన్ని ఇష్టపడుతున్నారనే చెప్పాలి. విమాన ప్రయాణం విషయంలో చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఫ్లైట్ మోడ్ ఎందుకు…? గంట ముందు ఎందుకు చెకిన్ అవ్వాలి వంటి విషయాలు చాలా మందికి తెలియనివి కదా…?
ఇప్పుడు మనం మరో విషయం గురించి కూడా తెలుసుకుందాం. విమానం టేకాఫ్, ల్యాండింగ్ సమయంలో విండో ఓపెన్ చేయాలని సూచిస్తూ ఉంటారు. చాలా మంది భయపడి విండో క్లోజ్ చేసేస్తూ ఉంటారు. అసలు మనం విమానంలో కిటికీలను ఎందుకు తెరిచి ఉంచాలి? అనేది చూద్దాం. దానికి పెద్ద కారణమే ఉంది. విండో ఓపెన్ చేసినప్పుడు దాదాపుగా ప్రతీ ఒక్కరికి రెక్కలు కనపడతాయి.
అలా ఓపెన్ చేసే సమయంలో విమానం బయట రెక్కలకు, ఇంజనుకు ఏదైనా దెబ్బ తగిలినా సరే లేదంటే ప్రమాదవ శాత్తు మంటలు వచ్చినా ప్రయాణీకుల్లో ఎవరో ఒకరు దాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది. వెంటనే ఎయిర్ హోస్టెస్ కి చెప్పి అప్రమత్తం చేయవచ్చు. కిటికీలను ఓపెన్ చేయాలని ఎయిర్ హోస్టెస్ మనలను అడిగేది కూడా అందుకే. ఇక ఆ సమయంలో రెక్కలకు ఉండే లైట్ల వెలుతురును
కూడా కాస్త తగ్గించడంతో బయటి వస్తువులు కూడా స్పష్టంగా కనపడతాయి. ప్రమాదం సమయంలో ప్రయానికులను వెంటనే బయటకు పంపే అవకాశం ఉంటుంది.
Advertisements
Also Read: కేటీఆర్.. చర్చకు సిద్ధమా? రఘునందన్ సవాల్..!