బ్యాంకు లో చెక్ డిపాజిట్ చేయడం అనేది మనం ఏదోక సందర్భంలో చేస్తూనే ఉంటాం. బ్యాంకులో చెక్ డిపాజిట్ చేయగానే అక్కడ ఉండే క్యాషియర్ మనను ఒక సంతకం అడుగుతారు. చెక్ వెనుక సంతకం చేయమని అడగడం మనల్ని కాస్త ఆశ్చర్యపరుస్తుంది. బ్యాంకులో చెక్కు వెనుక సంతకం చెయ్యమని అడగటం ఒక రూలా అంటే ఒకరకంగా చెప్పాలి అంటే అది రూలు అని చెప్పలేం.
దీనికి సంబంధించి బ్యాంకింగ్ లా అండ్ ప్రాక్టీసు సబ్జెక్ట్ లో ఒక ప్రాక్టికల్ ప్రశ్న కూడా ఉంది. బేరర్ చెక్కేనా కాదా అనే లేక సెల్ఫ్ చెక్కు అయితే మీరేనా కాదా అలాగే పే టు తరవాత మీ పేరే ఉందా అని పరిశీలించి మిమ్మలిని అడిగి సంతకం చేసిన తరవాత మీకు డబ్బు చెల్లిస్తారు క్యాషియర్. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏక్ట్ క్రింద నార్మల్ బ్యాంకింగు కోర్సులో వ్యాపారవేళలో అటువంటి చెల్లింపు జరిగితే బ్యాంకరుకి రక్షణ ఉంటుంది.
అందుకే రొటిన్ బ్యాంకింగు లావాదేవీల్లో భాగంగా సంతకం చేయమని క్యాషియర్ అడుగుతారు. సంతకం పెడితే డబ్బులు ఇస్తున్నప్పుడు సంతకం పెట్టడంతో మనకు వచ్చే నష్టం ఏముంది…? అదేమి బ్లాంక్ పేపర్ కాదు కదా… గుర్తు తెలియని వ్యక్తులకు మనం సంతకం ఇవ్వడం లేదు కదా…? కాబట్టి సంతకం అడిగితే ఇబ్బంది పెట్టకుండా, పడకుండా పెట్టేయండి.
Also Read: ప్రధాని సెక్యూరిటీ నల్ల కళ్ళద్దాలు ఎందుకు ధరిస్తారు…?