మనం తలపెట్టిన పనుల్లో, కార్యాల్లో ఎలాంటి విఘ్నాలు ఎదురవ్వకుండా ఉండాలని మొదట విగ్నేశ్వరున్ని పూజిస్తాం. వినాయకుడు అందరికి ఇష్టమైన దేవుడు. అలాగే పూజలు లేదా హోమాలు, మరియు ఎలాంటి శుభకార్యమైన మొదట మనం పూజించేది కూడా వినాయకుడినే. గణపతి విగ్రహాల్లో కొన్నింటికి కుడివైపు, లేదా ఎడమ వైపుగా తొండం ఉంటుంది. మరికొన్ని విగ్రహాల్లో నిటారుగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా ? అలా ఎందుకు ఉంది? వాటి ప్రాముఖ్యత ఏంటి ? అనే సందేహం రాక మానదు అలా ఉన్న విగ్రహాలకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం.
తొండం ఎడమవైపు గా ఉన్న గణపతి యొక్క ప్రత్యేకత :

గణపతి తొండం ఎడమవైపుగా ఉంటె అది ఇంటికి మంచిదట. ఇంట్లో ఉన్న వాస్తు దోషాలని సవరిస్తుందని చెబుతుంటారు. ఎడమవైపుకు ఉంటె తొండం ఇడ నాడిని చూపిస్తూ ఉంటుందట అలాగే మానవులకి కుడా ఇడ నాడి ఎడమ నాసిక రంద్రం వైపే ఉంటుంది. దేనికి మరో పేరు చంద్ర నాడి అని కూడా పిలవబడుతుంది. ఇడ నాడి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఎడమవైపుకు తొండం ఉండే గణనాధుని విగ్రహం జీవితం లో ప్రశాంతత ని ఎంతో శక్తిని కూడా అందిస్తుంది. అలాగే శివ పార్వతులతో కలిసి ఉన్న విగ్రహాలు కానీ, పటాలు కానీ పూజించడం వలన మనకు కుటుంబ బంధాల్లో అనురాగం, సంతోషం లభిస్తాయట.
తొండం కుడివైపు గా ఉన్న గణపతి యొక్క ప్రత్యేకత :

కుడివైపు తొండం కలిగి ఉండే విగ్రహాలు మనకు చాలా అరుదుగా కనిపిస్తాయి. కుడివైపుగా తొండం కలిగి ఉన్న విగ్రహం కేవలం ముంబై నగరం లోని ఒక దేవాలయంలో మాత్రమే ఉంది. ఈ వినాయకుడిని ‘సిద్ది వినాయకుడిని’ కూడా పిలుస్తారు. నియమ నిష్ఠలతో పూజిస్తే త్వరగా కార్య సిద్దిని మనకు ప్రసాదిస్తాడు. ఇలాంటి విగ్రహాలు ఇంట్లో ఉండకూడదట కొన్ని నియమాలు, నిష్ఠలు తప్పక పాటించాలి. అలాంటి వాతావరణం అందరి ఇళ్లల్లో సాధ్యం కాకపోవచ్చు. అందుకోసమే ఇలాంటి విగ్రహాలు కేవలం దేవాలయాలకి మాత్రమే పరిమితం చేసారు. కుడివైపుగా ఉన్న విగ్రహం పింగళ నాడి మరియు సూర్య శక్తిని సూచిస్తుంది. సూర్య శక్తిని సృష్టించే అంత మహిమ ఉంటుంది. అలాగే సూర్య శక్తిని వినాశనం కూడా చెయ్యగలదు. అందుకే వేదాల్లో చెప్పబడిన విధంగా మాత్రమే వినాయకుడిని పూజించి ఆచారాలని పాటించాలి.
తొండం నిటారుగా ఉన్న గణపతి ప్రత్యేకత:

ఇలాంటి విగ్రహాలు చాలా అరుదుగా ఉంటాయి. తొండం నిటారుగా ఉన్న విగ్రహాలకు కూడా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. వినాయకుడి తొండం నిటారుగా ఉందంటే అర్థం సుషుమ నాడి తెరచి ఉంది.ఈ విగ్రహాలకు పూజించిన భక్తులకి పూర్తి దైవత్వం లభిస్తుందట. అయితే కుడి వైపు తొండం ఉండే వినాయక విగ్రహాలను పూజించినంత కఠిన ఆచారాలు లేనివారు కూడా.. ఈ వినాయకుడికి సాధారణ పూజ చేసుకోవచ్చును ఇలాంటి విగ్రహాలని తమ ఆత్మీయులకు బహుమానంగా ఇస్తూ ఉంటారు. ఇలాంటి విగ్రహాలు మనకు దొరకడం చాలా అరుదు.