మెగాస్టార్ చిరంజీవి ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ భావిస్తున్న లూసిఫర్ రీమేక్ కోసం దర్శకులు మారుతూనే ఉన్నారు. మొదట సాహో ఫేమ్ సుజిత్, ఆ తర్వాత వినాయక్, హరీష్ శంకర్.. ఇలా టాలీవుడ్‌లోని మరకొందరి టాప్ డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే చివరికి తమిళ దర్శకుడు మోహన్ రాజాకు సెలెక్ట్ చేసుకున్నాడు చిరంజీవి. అయితే తెలుగులోనే మంచి డైరెక్టర్లు ఉండగా.. చిరు ఏరి కోరి కోలీవుడ్ నుంచి దర్శకుడిని పట్టుకురావడమేంటన్న ప్రశ్నలు చాలా మందిని వెంటాడుతున్నాయి. అయితే ఇందుకు పెద్ద కారణమే ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
20 ఏళ్ల క్రితం హనుమాన్ జంక్షన్ సినిమా డైరెక్ట్ చేసిన మోహన్ రాజా.. ఆ తర్వాత టాలీవుడ్‌లో మరో సినిమా చేయలేదు. కానీ తెలుగులో విజయం సాధించిన సినిమాలన్నింటినీ.. తన తమ్ముడు జయం రవి హీరోగా రీమేక్ చేసి వరుస హిట్లు కొట్టాడు. జయం, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, బొమ్మరిల్లు, ఆజాద్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఇలా అన్నింటికి అక్కడ దించేశాడు. ఇక తెలుగులో వచ్చిన ధృవ మాతృక.. తమిళ్ ఒరువన్ తీసిందీ ఆయనే. మోహన్ రాజా రీమేక్ చేసిన సినిమాలన్నీ ఘన విజయం సాధించినవే కావడంతో.. లూసిఫర్ రీమేక్‌కు మోహన్ రాజానే కరెక్ట్ అని చిరు భావించడాట. ఇదే మోహన్ రాజా.. గతంలో చిరుతో హిట్లర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అదీ విషయం.