ఎంపీ సంతోష్ బర్త్ డే సందర్భంగా అటు సొంత పార్టీ లీడర్స్ తోపాటు క్యాడర్ కూడా మొక్కలు నాటేందుకు పోటీ పడ్డారు అంతవరకు బాగానే ఉంది కాపోతే అధికారులు కూడా పోటిపడడం తో చర్చకు తెరలేచింది ఎందుకు అధికారులు ఇంత హడావిడి చేసారు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సైతం మొక్కలు నాటడంలో పోటీపడ్డారు కేసీఅర్ కేటీఆర్ హరీష్ కవిత ల జన్మదినం సంద్భంగా కూడా అధికారులు మొక్కలు నాటిన సందర్భంలేదు అలాంటిది సంతోష్ బర్త్ డే కి ఇంత హంగామా ఏమిటి అని గుస గుస లు వినిపిస్తునాయి కేసీఆర్ దగ్గర నిత్యం ఉండే సంతోష్ ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకోవాలన్న ఏమి జరగాలన్న ఆయనే కీలకం అందుకే సంతోష్ ను ప్రసన్నం చేసుకునేందుకు అటు అధికారులు ఇటు పార్టీ నాయకులు పోటీ పడుతున్నారని చెప్పుకొస్తున్నారు పదవులు కావాలనుకునే వారు పనులు కావాలనుకునే వారు కీలక పోస్టులు ప్రోమోషన్స్ దక్కించు కోవాలని ప్రయత్నించే అధికారులు ఇలా అందరి చూపు సంతోష్ మీద ఉండడమే కారణం అని అంటున్నారు. అందుకే తన బర్త్ డే కి కేకులు కట్ చేయడం భోకేలు ఇవ్వడం సన్మానాలు చేయడం కాదు ప్రతిఒక్కరూ ఒక మొక్క నాటి నాకు ఫోటో వాట్స్ అప్ లో పెట్టాలని పిలుపునిచ్చారు ఇదే మంచి అవకాశం అనుకున్న అధికారులు నాయకులు పోటీలు పడ్డారు అని చెప్పుకుంటున్నారు ఇది పార్టీలో ఎటువంటి ప్రకంపనాలు స్పృష్టిస్తుందో అంటున్నారు. కేటీఆర్ సహజంగానే హంగుహర్భాటనికి దూరంగా ఉంటారు అలాంటిది సంతోష్ బర్త్ డే సందర్భంగా అధికారులు నాయకులు చేసిన హడావిడి కేటీఆర్ కి ఎలాంటి కోపం తెపిస్తుందో ఎలా రియాక్ట్ అవుతారో అనే ఆందోళనకూడా క్యాడర్ లో వ్యక్తం వుతుంది చూడాలి ఏమి జరుగుతుందో…….