ఎమ్మార్వో హత్యపై పోలీస్ శాఖ మౌనం ఎందుకు? - Tolivelugu

ఎమ్మార్వో హత్యపై పోలీస్ శాఖ మౌనం ఎందుకు?

Why Telangana Police Not Responding On MRO vijaya reddy Case, ఎమ్మార్వో హత్యపై పోలీస్ శాఖ మౌనం ఎందుకు?

ఎమ్మార్వో విజయారెడ్డి హత్యపై పోలీసులు నోరు మెదపరా…? రికార్డు సమయంలో కేసులు చేధిస్తాం అని గొప్పలు చెప్పుకునే రాచకొండ పోలీస్‌ బాస్‌ ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు…? హత్య వెనుక ఎవరెవరున్నారో ఇంకెప్పుడు బయటపెడుతారు..? రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా…? పోలీస్‌ బాస్‌లు సైలెంట్ ఎందుకు…?

మండల మేజిస్ట్రేట్‌ చనిపోయి నాలుగు రోజులు అవుతోంది. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో హత్య జరిగింది. హత్య ఎందుకు జరిగిందో కొంతైనా క్లారిటీ ఉంది, హత్య చేసిన వ్యక్తి, నేపథ్యం అంతా తెలుసు. మరీ దేశంలోనే నెంబర్ వన్ పోలీస్ అని చెప్పుకునే మన పోలీసులు, పోలీస్ బాస్‌లు ఎందుకు ఎమ్మార్వో విజయారెడ్డి హత్యపై మాట్లాడటం లేదు…? హత్య జరిగి నాలుగు రోజులు కావొస్తుంది అయినా ఎందుకు ప్రెస్ మీట్‌ పెట్టి మాట్లాడటం లేదు, సురేష్ ఒక్కడే పథకం వేశాడా.. అతని వెనుక ఎవరైనా ఉన్నారా అన్న అంశంపై ప్రకటన చేయకపోవటంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతోన్నాయి.

సురేష్ ఒక్కడే ఉంటే ఎందుకు బయటకు చెప్పటం లేదు, బాచారం భూమి కోసమే హత్య జరిగిందా లేక ఇంకా ఎదైనా ఉందా, సురేష్ వెనుక రియల్టర్లు, రాజకీయ నాయకులు ఉన్నారు అని వస్తున్న ప్రశ్నలకు సమాధానం మాత్రం చెప్పటం లేదు.

ఇంత పెద్ద ఇష్యూ జరిగితే… సీపీ ఒక్కమాట కూడా కేసు దర్యాప్తుపై మాట్లాడటం లేదంటే అనుమానం వ్యక్తమవుతోందని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన తర్వాత పెట్రోల్ పోసి చంపేస్తాం అని బెదిరిస్తున్న సందర్బాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. కనీసం వాటిని అరికట్టేందుకు అయిన పోలీస్ శాఖ ఒక్కమాట అయిన మాట్లాడటం లేదని… రాష్ట్రంలో హోంమంత్రి అసలు ఉన్నారా అని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మార్వో చనిపోతే… ఉలుకు పలుకు లేదని ఆరోపిస్తున్నారు.

ఇక ఎమ్మార్వోను కాపాడే ప్రయత్నంలో… ఎమ్మార్వోతో పాటు డ్రైవర్‌ కూడా మృతి చెందారు. పేదరికంతో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు కనీసం పరిహరం కూడా ప్రకటించ లేదు ప్రభుత్వం. ప్రభుత్వ పెద్దలు ఎవరూ విజయారెడ్డి కుటుంబాన్ని కానీ, డ్రైవర్ కుటుంబాన్ని కానీ పరామర్శించ లేదు. దీంతో రెవెన్యూ సంఘాలు, ఉద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటన ఎందుకు జరిగింది, భవిష్యత్‌లో ఇలా జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, బాధ్యులు ఎవరు అని ప్రకటించటంతో పాటు, పెద్ద దిక్కులు కోల్పోయిన బాధిత ఫ్యామిలీని ఆదుకోవటం ప్రభుత్వ బాధ్యత కాదా అని ప్రశ్నిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp