ఈ రోజుల్లో వాట్సాప్ లేని ఫోన్ లేదు అనే మాట వాస్తవం. కేవలం వాట్సాప్ కోసమే ఫోన్ కొనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో వాట్సాప్ వాడకం తగ్గడం టెలిగ్రాం సహా మరికొన్ని యాప్స్ వాడకం అనేది క్రమంగా పెరిగింది. అయితే వాట్సాప్ కంటే టెలిగ్రాం చాలా బెస్ట్ అనే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఏంటీ అనేది ఒకసారి చూద్దాం.
Also Read:మంచు ఎఫెక్ట్.. వరుసగా 60 వాహనాలు ఢీ.. వీడియో ఇదిగో..!
ప్రైవసీ విషయంలో వాట్సాప్ కంటే కూడా పటిష్టంగా ఉంటుంది ఈ యాప్. మీ ఫోన్ నంబర్ ఎవరికీ కనపడకుండా కూడా ఇది వాడుకునే అవకాశం ఉంది. గ్రూప్స్ లో నెంబర్ కనపడటం అనేది ఎప్పటికి అయినా ప్రమాదమే. కాని ఈ యాప్ లో గ్రూప్స్ లో నెంబర్ లు కనపడకుండా కంట్రోల్ చేయవచ్చు. ఒక గ్రూప్ లో జాయిన్ అయితే మాత్రం గత మెసేజ్ లు చూడవచ్చు. గ్రూప్ లో గరిష్ట సభ్యుల సంఖ్య 2,00,000 మంది ఉండవచ్చు.
కాని వాట్సాప్‌లో మాత్రం 256. గ్రూప్ లో మన నెంబర్ కనపడకుండా కంట్రోల్ చేయవచ్చు. గ్రూప్ లో పంపిన మెసేజ్ లు ఎప్పుడైనా ఎడిట్ చేయవచ్చు లేదా రిమూవ్ చేయవచ్చు. మెసేజ్ ను పిన్ చేసే ఆప్షన్ గ్రూప్స్ లో ఉంటుంది. 1.5 GB వీడియో లు పంపే అవకాశం ఉంది. ఇంటర్నెట్ లింక్స్ ను అందులోనే ఓపెన్ చేయవచ్చు. పోల్స్ కూడా ఇందులో పెట్టె అవకాశం ఉంది. ఇక టెలిగ్రాం పూర్తిగా ఉచితం. వాట్సాప్ మాదిరిగా అమ్ముడుపోలేదు అంటారు నిపుణులు.
Also Read:బ్లాక్ టూ వైట్ పార్ట్ -2.. తొలివెలుగు ఎఫెక్ట్ తో.. ఫినిక్స్ భరతం పడుతున్న ఐటీ