సినిమాల్లో రాణించాలి అంటే బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే సరిపోదు. మనకు ఎన్నో లక్షణాలు ఉండాలి, ఎంతో ప్రతిభ ఉండాలి. టాలెంట్ ఉన్నంత మాత్రాన నెట్టుకు రావడం కూడా కష్హ్తమే. నటనలో టాలెంట్ మాత్రమే కాదు డాన్స్ లో టాలెంట్ ఉండాలి, డైలాగ్ డెలివరి ఉండాలి, అవసరమైతే పాటలు కూడా పాడాల్సిన అవసరం ఉంటుంది. అలా ఎన్నో చేసి నేట్టుకొస్తే స్టార్ ఇమేజ్ వస్తుంది.
ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. చిరంజీవి అంటే డాన్స్, నటన, డైలాగ్ డెలివరీ ఇలా ఎన్నో ఉన్నాయి. ఇక ఆయనకు ప్రత్యేక ఇమేజ్ తీసుకు వచ్చింది డాన్స్. చిరంజీవి డాన్స్ అంత అందంగా కనపడటానికి మొదటి కారణం ఆయన డాన్స్. మరీ పొడుగ్గా ఉండకపోవడం, పొట్టిగా లేకపోవడంతో ఆయన డాన్స్ అందంగా కనపడుతుందని అంటారు.
ఆయన సినిమాల్లోకి రాక ముందు ప్రత్యేకంగా డాన్స్ ఏమీ నేర్చుకోలేదు. ఒక డాన్స్ మాత్రమే చేయలేదు, డాన్స్ లో ఎన్నో హావభావాలు ఉంటాయి. ఆ ట్రెండ్ తర్వాత ఇండియా మొత్తం పాకింది. అంతులేని ఎనర్జీ తో అందమైన డాన్స్ చేయడం, మంచి ఈజ్ కొనసాగించడం చూస్తూ ఉండేలా చేస్తుంది. 30 ఏళ్ళ క్రితం చేసిన డాన్స్ కూడా మనకు ఇప్పుడు కొత్తగా ఉంటుంది. ఇప్పుడు డాన్స్ లో చిరంజీవికి వారసులు టాలీవుడ్ లో ఉన్నారా అంటే ఇద్దరి పేర్లు వినపడతాయి. అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే చిరంజీవి వారసులు అంటారు.
Advertisements
Also Read: ఏనుగుపాలు తాగిన పాప.. విచిత్రం ఏందంటే..?