పోకిరి సినిమా చూసినప్పుడు ఒక మాస్ సీన్ మనల్ని చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఒక ఫైట్ సీన్ లో ఇలియానా గాయపడినప్పుడు మహేష్ బాబు… ఆస్పత్రికి వెళ్లి ఇలియానాకు వైద్యం చేయమంటే కంప్లైంట్ చేయమని డాక్టర్ అడిగితే… మహేష్ కూడా డాక్టర్ చేయి కోస్తాడు. వాస్తవానికి రియల్ లైఫ్ లో అలాగే ఉంటుంది. ప్రమాదాలు కానీ, నేరాలు కానీ జరిగినప్పుడు వైద్యులు వెంటనే రోగులకు చికిత్స చేయవచ్చా అనే దానిపై అవగాహన లేదు.
Also Read: ఎఫ్ఐఆర్ లో కులం పేరు ఎందుకు నమోదు చేస్తారు…?
ఒకప్పుడు ప్రమాదాలు, నేరాలు, ఆత్మహత్య ప్రయత్నం వంటి విషయాలలో పోలీసుల ద్వారా వస్తేనే వైద్యం జరిగేది. అప్పుడు ఉన్న చట్టం పై తీవ్ర స్థాయిలో విమర్శలు ఉండేవి. దీనివల్ల సకాలంలో వైద్యం అందక బాధితులు ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయారు. ఇక పోలీసులు కూడా చాలా ఇబ్బందులు పడే వారు. కోర్ట్ లు కూడా పోలీసులను వేగంగా స్పందించలేదు అని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి.
వైద్యులు ఈ తరహా కేసులను స్వీకరించడానికి కూడా ముందు వచ్చే తల నొప్పులకు భయపడి అడుగు వేసే వారు కాదు. పోలీసు స్టేషన్ చుట్టూ, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుందనే భయం ఎక్కువగా ఉండేది. ఇదేకాదు, చూసిన నేరం, ప్రమాద విషయాలు పోలీసులకు తెలిపినా వారి చుట్టూ తిరగాలి. దీనితో పెద్దగా ఎవరూ వైద్యం చేయక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉండేది. దీనిని గమనించిన కేంద్ర ప్రభుత్వం… చట్ట సవరణ చేసింది. ఇలాంటి కేసులు స్వీకరిస్తే, రోగి వైద్యం జరిగాకా, నివేదిక పంపే వెసులుబాటు కల్పించారు. నేర, ప్రమాద వివరాలు తెలిపిన వారికి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేయడంతో సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.
Also Read: లోక్ అదాలత్ అంటే ఏంటీ…? కేసులను ఏ విధంగా పరిష్కరించుకోవచ్చు…?