టీవీ లు ఫ్యాన్ లు ఎక్కువ సేపు వాడితే ఎందుకు వేడెక్కుతాయి అనేది చాలా మందికి స్పష్టత లేదు కదా…? దానికి కారణం ఏంటో ఒక్కసారి చూద్దాం. ఈ మధ్య కాలంలో కొన్ని కంపెనీల ఫోన్ లు ఎక్కువగా హీట్ అవుతున్నాయి. రెడ్మీ కంపెనీ ఫోన్ ఎక్కువగా హీట్ ఎక్కుతూ ఇబ్బంది పెడుతుంది. సరే అవి ఎందుకు హీట్ అవుతాయి అంటే…
Also Read: పుష్ప నిర్మాతలు నా సర్జరీ వాయిదా వేయించారు – గణేష్ ఆచార్య
విద్యుత్ అంటే ఎలక్ట్రానుల ప్రవాహం కదా… ఆ ఎలక్ట్రానులు ఒక లోహపు తీగ వెంబడి ప్రయాణం చేసే సమయంలో ఆ ప్రయాణం సాఫీగా ఉండదు. ఆ ప్రవాహానికి లోహపు అణువులు అడ్డు పడటంతో… ప్రవాహంలో ఉన్న ఎలక్ట్రానుల గతి శక్తి (kinetic energy) కొంత లోహపు అణువులకి బదిలీ కావడం జరుగుతుంది. ఆ సమయంలో లోహపు అణువులు కంపించడం స్టార్ట్ అవుతుందని నిపుణులు చెప్తున్నారు.
ఆ సమయంలో వచ్చే కంపన ద్వారా వేడి స్టార్ట్ అవుతుంది. చలనం ద్వారానే కదా వేడి పుట్టేది… చలిగా ఉంటే మనం చేతులు రుద్దుకున్నట్టే అక్కడ కూడా. ఇదే విద్యుత్ పరికరాలు హీట్ అవ్వడానికి ప్రధాన కారణం. విద్యుత్ పరికరాలలో copper losses అనీ iron losses అనీ రెండు రకాలు ఉంటాయి. వీటి ద్వారా కూడా హీట్ ఎక్కుతాయి. విద్యుత్ ప్రయాణం జరిగే వాటిలో వేడి ఎక్కడం కామన్ విషయం గానీ… అవి సడెన్ గా హీట్ ఎక్కితే ఎందుకు హీట్ ఎక్కుతున్నాయో తెలుసుకోవడం మంచిది.
Advertisements
Also Read: ఇండియా లో అత్యధిక పారితోషికం తీసుకునే టెలివిజన్ నటి ఎవరో తెలుసా ?