బంగారం ధర రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితి, డిమాండ్ పెరగడం వంటి అంశాలతో బంగారం ధర ప్రతీ రోజు పెరుగుతూ పోతుంది. ప్రస్తుతం మన దేశంలో బంగారానికి మంచి మార్కెట్ ఉన్న నేపధ్యంలో షాపులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి అనే చెప్పాలి. కార్పోరేట్ దిగ్గజాలు కూడా బంగారం వ్యాపారం మీద ఫోకస్ చేసారు.
Also read: శోభనం గదిలోకి పెళ్లి కూతురి తల్లి కూడా, లేదంటే విడాకులే…? ఎక్కడ ఆ సాంప్రదాయం…?
గత మూడేళ్ళుగా చూసుకుంటే లలితా జ్యువెలరీ బాగా ఫేమస్ అయింది. ఆ షాపు కంటే ఆ షాప్ యజమాని బాగా ఫేమస్ అయ్యారు. ఆయన తన ప్రకటనల్లో భాగంగా బంగారు ఆభరణాల ధరతో ఇతర షాపుల్లోని ఆభరణాల ధరను పోల్చిచూడమని ధైర్యంగా చెప్తూ ఉంటారు. దీనితో చాలా మందిలో ఉండే అనుమానం… వేరే షాపుల వాళ్ళు ఏమైనా మనల్ని మోసం చేస్తున్నారా…? అంత ధైర్యంగా చెప్తే ఎవరికి అయినా వచ్చే అనుమానం అదే.
వాస్తవంగా మాట్లాడితే… లలిత జ్యూవెలరీస్ వాళ్ళ టార్గెట్ కస్టమర్స్ మధ్య తరగతి వాళ్ళ కంటే తక్కువగా ఉండే వాళ్ళు. అంటే దిగువ మధ్య తరగతి, పేదవారు. మీరు ఎప్పుడైనా ఆ స్టోర్ చూస్తే… కూరగాయల మార్కెట్ లా ఉంటుంది. వాళ్లకు ఎక్కువ బంగారం కొనాలని ఉంటుంది, ధర తక్కువగా ఉండేది కావాలి. అందుకనే ఈ షాపుకి వెళ్తూ ఉంటారు.
Advertisements
ఈ షాపులో ఉండే బంగారం 24 కారెట్లు, 22 కారెట్లు మాత్రం కాదు అని కొందరు ఆరోపిస్తున్నారు. దాదాపు 18 కారేట్ల దగ్గరలోనే ఉంటుందని కొందరు కామెంట్ చేస్తున్నారు. డిజైన్స్ కూడా పెద్ద గొప్పగా ఉండేవి ఉండవనేది కొందరి మాట. కాబట్టే ఆ అంకుల్ గారు అంత ధైర్యంగా తక్కువ తక్కువ అంటూ ఉంటారు. అందరికి బంగారం ఉండాలి అనే లక్ష్యంతో ఈ షాపు యజమాని వ్యవహరిస్తూ ఉంటారని దిగువ మధ్య తరగతి వాళ్ళ కోసమే షాపులో ఆఫర్లు ఉంటాయని చెప్తున్నారు.
Also read : దళితులంటే ఎందుకంత చిన్నచూపు..?