తెలుగు వారంటే సినిమా, సినిమా అంటే తెలుగు వారు. తెలుగు వారు మాత్రమే కాదు గానీ సౌత్ ఇండియాలో చాలా వరకు సినిమాల పిచ్చి ఉందనే చెప్పాలి. సినిమా మొదటి రోజు చూడాలి అనుకునే బ్యాచ్ లు మనకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. మన ముందు తరాలు కూడా సినిమాను ఎక్కువగానే ప్రేమించాయి అనే మాట వాస్తవం. ఇక ఇప్పుడు సినిమాలకు పెరుగుతున్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
అసలు ఎందుకు మన వాళ్లకు సినిమా అంటే పిచ్చి అనేది చూద్దాం. మనకు చిన్నప్పటి నుంచి అమ్మ గోరుముద్దలు పెడుతూ పాడే పాటలు… నాన్న చెప్పే కథలు, పంట పొలాల్లో పాటలు పాడుతూ… అది సినిమా అయినా జానపదం అయినా సరే ఏదోక రూపంలో పాట అనేది వినపడుతుంది. ఇక ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా సరే పాటలు అనేది అప్పటి నుంచి ఇప్పటికి కామన్ అయ్యాయి.
అలాగే… గ్రామాల్లో జరిగే కొన్ని వేడుకలకు కూడా పాటలు, కథలు వంటివి బాగా ప్రాచర్యం పొందాయి. ఏ మాటకు ఆ మాట చెప్పాలిగాని మన తెలుగు వాళ్లకు కళలు అంటే ప్రాణం. అలా క్రమంగా సినిమాలను ఆదరిస్తూ వచ్చారు. ఇక మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వ్యవసాయ పనులు సహా గ్రామాల్లో ఎక్కువగా కష్టపడే వారు. రోజు అంతా కష్టపడి సాయంత్రానికి కాస్త వినోదం కోరుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో నాటకాలు సినిమాలు అనేవి రావడంతో వాటిని ఆదరించి, అందులో కనపడే వారిని దేవుళ్ళుగా భావించారు.
Advertisements
Also Read: యాంకర్ సుమ కెరీర్ సీక్రెట్ ఏంటీ…? ఆమెకు ప్లస్ పాయింట్ ఏంటీ…?