మాములుగా మనం కొన్ని కొన్ని విషయాలను పెద్దగా గ్రహించే ప్రయత్నం చేయలేం. అలాంటిదే బస్సు లో అలాగే ట్రైన్ లో సీట్లు ఎందుకు నీలం రంగులో ఉంటాయి…? ఈ విషయంపై చాలా మందికి అవగాహన లేదు. బస్సు లోపల ఉండే సీట్లు ట్రైన్ లోపల ఉండే సీట్లు నీలం రంగులోనే ఉంటాయి. నీలి రంగును ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటీ అంటే… శాస్త్రవేత్తల ప్రకారం మన మెదడు ఒక్కొక్క రంగు కు ఒక్కో విధంగా స్పందిస్తుంది.
నీలిరంగు విషయానికి వస్తే నీలిరంగు మనకు రక్షణ, రిలాక్సేషన్ కూడా ఇస్తుంది. అలాగే మనం ప్రయాణించే ముందు ఎక్కువ సేపు ట్రైన్, బస్సు కోసం వేచి ఉండటం మరియు బస్సును ట్రైను మిస్ అవుతావని తొందర పడటం వంటివి ఎక్కువగా జరుగుతూనే ఉంటాయి. దీనితో మనం ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అవుతాము. కావున మనం బస్సులోకి ట్రైన్ లోకి వెళ్ళిన తర్వాత నీలిరంగు సీట్ల ను చూసి మనకు రిలాక్సేషన్ ఫీల్ వస్తుంది.
అందువలన బస్సు లోపల ఉండే సీట్లు ట్రైన్ లోపల ఉండే సీట్లు నీలిరంగులో ఉండేలా చూస్తారు. ఈ లాజిక్ ఆధారంగా జపాన్ టోక్యో నగరంలో వీధి దీపాలను నీలి రంగులోకి మార్చారు. దీని కారణంగా అక్కడ క్రైమ్ రేటు కూడా చాలా వరకు తగ్గినట్టుగా గుర్తించారు. తప్పు చేయాలి అనుకునే వాళ్ళ మనస్తత్వాన్ని ఈ నీలిరంగు వీధి దీపాలు కొంతవరకు శాంతింప చేస్తాయని గుర్తించారు. నీలి రంగు దీపాలు మొక్కల పెరుగుదలను కూడా ప్రభావితం చేస్తాయని గుర్తించారు.