ఒకప్పుడు దర్శకుడు తేజకి మంచి ఇమేజ్ ఉంది. తేజ సినిమాలు అంటే యువత ఎక్కువగా చూసేవారు అప్పట్లో. స్టార్ హీరోల కంటే చిన్న హీరోలు, కొత్త హీరోలతో సినిమాలు చేయడానికి తేజ ఎక్కువగా ఆసక్తి చూపించేవాడు. అందుకే కొత్త హీరోలను పరిచయం చేసాడు. రాజకీయ నేపధ్యం ఉన్న కథలు కూడా చేయడానికి ఇష్టపడే ఇప్పుడు కాస్త స్లో అయ్యారు. స్టార్ హీరోతో ఒక సినిమా లాంచ్ చేస్తారని అంటున్నారు.
మెగా ఫ్యామిలీ తో దూరంగా ఉంటాడని అందుకే తేజా కెరీర్ కాస్త స్లో అయింది అనే కామెంట్స్ ఉన్నాయి. ప్రస్తుతం నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తో ఒక సినిమా ప్లాన్ చేసాడని త్వరలోనే ఈ సినిమాను ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. తేజా… బాలకృష్ణతో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమానే ఎన్టీఆర్ బయోపిక్. నేనే రాజు నేనే మంత్రి సినిమాను బాగా చేయడంతో బాలకృష్ణ… తేజాతో సినిమా చేయాలి అనుకున్నారు.
బయోపిక్ అనుకున్న వెంటనే తేజకి చెప్పారు బాలకృష్ణ. కాని తేజా ఎన్టీఆర్ పై నెగటివ్ సన్నివేశాలు కూడా కథలో రాసారట. ఎన్టీఆర్ బయోపిక్ లో నెగటివ్ సన్నివేశాలు ఎలా రాస్తావని అన్నారట బాలయ్య. కాని తేజా మాత్రం ఆ సీన్ లు కూడా ఉంటేనే బాగుంటుంది అని చెప్పారట. అవి లేకుండా తాను చేయలేను అని చెప్పడంతో బాలయ్య… తేజాని పక్కన పెట్టి క్రిష్ తో చేసారు.