గత పదేళ్ళ కాలంలో దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డుల సంఖ్య క్రమంగా పెరిగింది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సైతం కార్డ్ తో చెల్లింపులు చేసే వ్యవస్థ బలపడింది. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు చేపట్టడం బాగా కలిసి వచ్చిన అంశంగా చెప్పాలి. పేదల్లో చాలా మంది ఇప్పుడు కార్డుల వాడకంపై అవగాహన పెంచుకోవడంతో బ్యాంకు లు కూడా ప్రోత్సహిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే కార్డుల విషయంలో మనకు తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి.
Also Read:అర్ధరాత్రి అలజడి.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ..!
అవే వీసా కార్డు, మాస్టర్ కార్డు, అమెరికన్ ఎక్ష్ప్రెస్స్ వంటివి. ఇక ఇప్పుడు రు పే కార్డు దేశంలో ఎక్కువగా విస్తరించింది. వీసా, మాస్టర్, అమెరికన్ ఎక్ష్ప్రెస్స్ కార్డులు విదేశాల నుంచి దేశంలోకి వచ్చిన కార్డులు. రూపే కార్డు మాత్రమే మన దేశం కార్డు. NPCI (National Payments Corporation of India ) సంస్థ మనదేశంలో 20 మార్చ్ , 2012 నుండి నిర్వహిస్తున్న పక్కా స్వదేశీ కార్డు RuPay card.
పూర్తిగా మన దేశీయ బ్యాంకుల్లో నగదురహిత లావాదేవీలు జరపాలనే ఉద్దేశంలో భాగంగా ఈ కార్డుని ప్రవేశ పెట్టారు. ఈ స్వదేశికార్డు ప్రవేశ పెట్టడానికి ముఖ్యకారణాలు ఏంటీ అంటే… ఒకటి మన బ్యాంకుల ఎలక్ట్రానిక్ లావాదేవీల్లో విదేశీ ఆధిపత్యాన్ని తగ్గించడం ఒకటి అయితే… ఎక్కువ మోతాదులో చార్జీలు వసూలు చేస్తున్న విదేశీ కార్డుల దోపిడిని అడ్డుకోవడం మరో కారణం. అందుకే చాలా తక్కువ చార్జీలతో సేవలందించడానికి రూపే కార్డుని ప్రవేశ పెట్టారు.
Also Read:నాని సినిమా ఫ్రీరిలీజ్ ఈవెంట్.. పవన్ కళ్యాణ్ గెస్ట్.!