జాతీయ జంతువు పులి, జాతీయ పక్షి నెమలి, జాతీయ గీతం జనగణమన, జాతీయ క్రీడా హాకీ… ఇలా మనకు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిని ఎందుకు ప్రకటించారు ఏంటీ అనేది చాలా మందికి తెలియని విషయం. ముఖ్యంగా క్రూర మృగం అయిన పులిని జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించారో తెలుసుకుందాం. దాని వెనుక కొన్ని బలమైన కారణాలు ఉన్నాయి.
Also Read:మలైకా-అర్జున్ కపూర్ విడిపోతున్నారా?
ప్రభుత్వం 1971 ఏప్రిల్ 1న పులిని జాతీయ జంతువుగా జిమ్మీ కార్బెట్ నేషనల్ పార్క్ నుండి ప్రకటన చేసింది. జాతీయ జంతువుగా ప్రకటించడానికి కీలకంగా మారింది మూడు కారణాలు. ఆకర్షణీయంగా రూపం, బలం, చురుకుదనం మరియి అమిత బలశాలి అనే విషయం చెప్పాల్సిన అవసరం. ఇది మన దేశ ఔన్నత్యం ప్రతీకగా ఉంటుంది అని ప్రకటన చేసారు. వాస్తవంగా పులి సింగిల్ గా ఉంటుంది.
ఇతర మృగాలు దాదాపుగా ఒకటి లేదా రెండు ఉంటే పులి మాత్రం ఒకటే ఉండి కష్టపడుతుంది. అలాగే మన భారతీయ చరిత్రలో, పురాణాల్లో విడదీయలేని భాగం పులికి ఉంది. దేశం నలుమూలల దాదాపు అన్ని అడవులలో కూడా దీని ఉనికి ఉంది. అలాగే నిరంతర మనుగడకోసం, దీనికి కాపాడుకోవడం కోసం, మన దేశ గొప్పదనం దీని రూపంలో చూపడానికి అవకాశం ఉంటుంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పులుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పులుల సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది.
Also Read:బ్యాడ్ సెంటిమెంట్ రోజురోజుకు బలపడుతోంది