వర్షా కాలంలో మనకు కలువ పూలు కనువిందు చేస్తూ ఉంటాయి. చెరువుల్లో నీరు ఎక్కువగా ఉండటంతో ఈ కాలంలో ఆ పూలు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. వాటిని అనేక రకాల అలంకరణ సందర్భాల్లో వాడుతూ ఉంటారు. అమ్మాయిలు కూడా వాటిని చూడగానే ఎంతో ఇష్టపడుతూ ఉంటారు. ఇక వాటికి సంబంధించిన ఎన్నో రకాల ఆసక్తికర విషయాలు ఉంటాయి.
Also Read:ఉప్పు ఎక్కువ తింటే మన బాడీలో ఏం జరుగుతుంది…?
అలాంటి విషయమే తామర ఆకు మీద నీళ్ళు ఎందుకు నిలబడవు అని. ఇతర ఆకుల మీద నీళ్ళు పోస్తే ఆ ఆకులు తడిచిపోతాయి. కాని తామర పూల మీద పోస్తే మాత్రం అవి చుక్కల మాదిరిగా మారిపోయి పక్కకు కారిపోతాయి. మామూలుగా ఇతర ఆకులలో దిగువ భాగంలో సన్నటి రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా వేర్ల నుంచి సేకరించిన నీరు కొంత ఆవిరి అవుతూ ఉంటుంది.
కానీ తామరాకు మీద పడిన నీటి బొట్టు తెల్లటి ముత్యంలా మెరిసి జారుతుంది. ఈ ఆకులు నీటి మీద తేలియాడటం వల్ల వాటి రంధ్రాలు దిగువ భాగంలో కాక ఆకు పైభాగంలో ఉంటాయి. అంతేకాకుండా అవి పల్చని చమురు లాంటి మైనం పూతతో కప్పి ఉంటాయి. ఈ మైనం పూత ఆకు మీద నీరు పడినప్పుడు ఆకు కుళ్ళిపోకుండా ఉండేందుకు ఆ నీరు కిందికి జారిపోయే విధంగా చేస్తుంది. వృక్షాలు జంతువుల ఆత్మ రక్షణ కోసం ప్రకృతి ప్రసాదించిన అద్భుతాలలో ఇది కూడా ఒక అద్భుతం అని అంటారు వృక్ష శాస్త్రవేత్తలు.
Also Read:తేనె వేడి చేసి తాగడం మంచిది కాదా…? ఆ రెండు ఎందుకు చనిపోతాయి…?