సంసారం అన్నాక భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి భార్యలపై చాలా మంది చెయ్యి కూడా చేసుకుంటారు. కానీ ఆ తరువాత మళ్లీ కలిసిపోతారు. కానీ ఇప్పుడు జరిగిన ఘటన మాత్రం బహుశా ఎక్కడా జరిగి ఉండకపోవచ్చు. వివరాల్లోకి వెళ్తే అహ్మదాబాద్ లోని వాస్నా ప్రాంతంలో హర్షద్ గోయల్ తారా గోయల్ లు నివసిస్తున్నారు. వీరికి వివాహం జరిగి చాలా ఏళ్ళు అవుతుంది. వీరిద్దరూ కూడా తరచుగా గొడవలు పడుతూనే ఉంటారు. మళ్లీ కలిసిపోతుంటారు.
అయితే ఈ సారి గొడవ కాస్తా పెద్దగానే అయింది. ప్రతి రోజు లానే చపాతీల్లోకి బంగాళదుంప కూర వండింది భార్య. తనకు షుగర్ ఉందని..ఈ కూర తింటే షుగర్ లెవెల్ పెరుగుతుందని తెలిసి కూడా ఎందుకు చేసావ్ అని భార్యపై అరిచాడు. దీంతో భార్యకు కోపం తన్నుకొచ్చింది. కష్టపడి వంట చేస్తే వద్దంటావా అంటూ బట్టలు ఉతికేందుకు ఉపయోగించే కర్రను తీసుకొచ్చి భర్తను చితక్కొట్టింది. దీంతో భర్త పెద్దగా కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు వచ్చి అతడిని రక్షించారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అతని కుడిచేయి భుజం విరిగినట్టు తేలింది.