భర్త విమానం ఎక్కించలేదని భార్య ఆత్మహత్య చేసుకుంది. గుంటూరుకి చెందిన వెంకటరమణ, ప్రవల్లిక హైదారబాద్ మాదాపూర్‌లో ఉంటారు. 2014లో ప్రేమ వివాహం చేసుకున్న వీరికి 9నెలల ఓ పాప కూడా ఉంది. తన కుమార్తెకు పుట్టు వెంట్రుకలు తీయించటానికి కుటుంబసభ్యులతో ట్రైన్ లో తిరుపతి వెళ్లాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల ట్రైన్ ప్రయాణం రద్దు కావటంతో… విమానంలో వెళ్దాం అని భర్త వెంకటరమణను కోరింది ప్రవల్లిక. అందుకు భర్త నిరాకరించటం తో మనస్థాపం చెంది ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.