ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య. హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అఫ్జల్ సాగర్ లో జరిగిందీ దారుణం. స్థానికంగా ఉండే ఓ హోటల్ లో వెయిటర్ గా పని చేస్తున్న రోషన్ కు లత అనే మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. పెళ్లయినా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది లత.
ఈ క్రమంలో ప్రియుడితో కలిసి భర్తను హతమార్చింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లత.. ఆమె ప్రియుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు పోలీసులు.