వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని వివాహిత తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించింది. 20 రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ పోలీసులు వివరాలు తెలిపిన ప్రకారం… మానుపాటి రాజయ్య కరీంనగర్ నగరపాలక సంస్థలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తూ రేకుర్తిలో నివాసం ఉంటున్నాడు. ఈ నెల 5న ఆఫీసుకు వెళ్లిన తన భర్త ఇంటికి రాలేదని పోలీస్ స్టేషన్ లో రాజయ్య భార్య లత ఫిర్యాదు చేసింది.
ఈనెల 16న మహబూబాబాద్ జిల్లా కురవిలో పోలీసులు ఓ గుర్తు తెలియని మృతదేహన్ని గుర్తించారు. అక్కడికి రాజయ్య కుటుంబ సభ్యులను తీసుకెళ్లి చూపించగా… వారు అతనిదేనని గుర్తించారు. అయితే, రాజయ్య కుటుంబ సభ్యులు ఆటో డ్రైవర్ ఎనగండుల బాబుపై అనుమానం వ్యక్తం చేశారు. తనను అదుపులోకి తీసుకొని విచారించగా రాజయ్య భార్యతో ఉన్న వివాహేతర సంబంధాన్ని బయటపెట్టాడు.
రాజయ్యను చంపేయాలని లత కోరటంతో బాబు ఈనెల 5న రాజయ్యను కల్లు తాగుదామంటూ హుస్నాబాద్ మండలంలోని మడదకు ఆటోలో తీసుకెళ్లాడు. కల్లు తాగాక రాజయ్యను చంపేందుకు వీలు కాలేదని బాబు లతకు చెప్పగా… ఎలాగైన చంపేయాలని పట్టుబట్టడంతో ముంజంపల్లి కెనాల్ వద్దకు తీసుకెళ్లి రాజయ్యకు మరోసారి కల్లు తాగించాడు. తనను మెడపై బలంగా కొట్టి, కెనాల్ లో తోసేసినట్లు బాబు అంగీకరించాడు.
పోలీసుల విచారణలో ఇద్దరు నేరం అంగీకరించటంతో… పోలీసులు రిమాండ్ చేశారు.