భాగ్యనగరంలో మరో నిత్య పెళ్లి కొడుకు మోసం బట్టబయలైంది. ప్రేమ, పెళ్లి పేరుతో ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఆరుగురు యువతులను ట్రాప్ చేసి.. వారి నుంచి డబ్బు కాజేశాడు చందానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన చీటర్ విజయ్‌భాస్కర్.
ఫేస్‌బుక్‌లో పెళ్లి కాని అమ్మాయిలను వలవేసి పట్టుకోవడం.. తీయటి మాటలతో వారిని బుట్టలో వేసుకోవడం విజయభాస్కర్‌కి వెన్నతో పెట్టిన విద్య. ఇందుకోసం బాగా డబ్బు ఉండే ఆంధ్రా అమ్మాయిలు, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో పనిచేసే యువతులను టార్గెట్‌గా చేసుకునేవాడు. వారిని ప్రేమలో పడేసి.. పెళ్లి చేసుకుందామని నమ్మించి.. ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు లాగేసేవాడు. తననకు కావాల్సింది దక్కగానే.. వారికి హ్యాండిచ్చి నీట్‌గా ఎస్కేప్ అయ్యేవాడు. పరువుపోతుందన్న భయంతో అ అమ్మాయిలు ఎవరూ తమ మోసం గురించి చెప్పుకునేందుకు బయటకు రాలేదు.
ఇటీవల తన భార్య సౌజన్యను వదిలించుకునేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో విజయ భాస్కర్ లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతూ వచ్చాయి. సౌజన్యను వదలించుకొని తన మేనకోడలిని మరో పెళ్ల చేసుకునేందుకు కుటుంబంతో కలిసి స్కెచ్ వేశాడు. దీంతో ఆమె ఒంగోలు పోలీసులను ఆశ్రయించింది. విజయ్ భాస్కర్ తనను మోసం చేశాడని.. పెళ్లి పేరుతో చాలా మందిని లొంగదీసుకున్నాడని ఫిర్యాదు చేసింది. ఇప్పుడు డబ్బుకోసం తనను కూడా వదలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తోది. తమకు మూడేళ్ల బాబు ఉన్నాడని.. న్యాయం చేయాలని సౌజన్య కోరుతోంది.