ఘట్కేసర్ పరిధిలో ఇటీవల ఓ మహిళ వివాహేతర సంబంధం రెండు ప్రాణాల్ని బలితీసుకుంది. తనతో కాకుండా మరొకరికి దగ్గరైందన్న కోపంతో ప్రియుడు ఆమె కూతుర్ని హత్య చేశాడు.బిడ్డపోయిన దు:ఖం..భార్యనిర్వాకంతో కలతచెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ దారుణం మరవకముందే మేడ్చల్లో మరో ఘోరం జరిగింది.ప్రియుడి మోజులో పడిన ఓ వార్డ్మెంబర్ భర్త హత్యకు కుట్ర పన్నింది. సురేష్ అని వ్యక్తి ఇటీవల యాక్సిడెంట్లో చనిపోయాడు. అంతా రోడ్డు ప్రమాదమే అనుకున్నారు.కానీ ఎందుకనో బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో అసలు విషయం వెలుగుచూసింది. సురేష్ది మేడ్చల్ పరిధిలోని సైదోని గడ్డ తండా. ఆయన భార్య వార్డ్ మెంబర్.ఆమెకు ప్రేమ్సింగ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడి మోజులో పడిన ఆమె భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రేమ్సింగ్తో కలిసి కుట్ర పన్నింది.ఎప్పట్లానే సురేష్ ఉద్యోగానికి వెళ్లాడు.అతను ఇంటికి తిరిగి వచ్చే దారిలో డీసీఎంతో మాటేశాడు ప్రేమ్సింగ్.కావాలనే సురేష్ వెళ్తున్న బైక్ను డీసీఎంతో ఢీకొట్టారు.గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలిస్తున్నట్టు హడావుడి చేశారు.గాయపడినా సురేష్ ప్రాణాలతోనే ఉన్నాడు. అంతే ఆస్పత్రికి వెళ్లేలోపే గొంతు పిసికి అతన్ని చంపేశారు. యాక్సిడెంట్ కథను రక్తికట్టించారు. బాలానగర్ పోలీసుల విచారణలో సురేష్ది ప్రీప్లాన్డ్ మర్డర్ అని తేలింది. ప్రేమ్సింగ్తో పాటు మరో ఆరుగుర్నినిందితులుగా గుర్తించారు. ముగ్గుర్ని అరెస్ట్ చేశారు.