అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. వివరాల్లోకి వెళ్తే… 2012లో సందీప్ రెడ్డి అనే వ్యక్తికి శ్రీలత రెడ్డికి వివాహం జరిగింది. కట్నంగా రూ.40 లక్షలు, 30 తులాల బంగారం తీసుకున్నాడు సందీప్. అయితే పెళ్లయిన కొద్దిరోజులకే శ్రీలతకు అత్తింటి వేధింపులు మొదలయ్యాయి. తాను అత్తారింట్లో 15 రోజులే ఉన్నానని.. ఏనాడు తనను భార్యగా గౌరవించలేదని.. పెద్ద మనుషులు పంచాయితీకి పిలిచినా రాలేదని వాపోయింది శ్రీలత.
భర్తపై కోర్టుకు వెళ్లానని.. మెయింటినెన్స్ కింద డబ్బులు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయని తెలిపింది. కానీ.. పోలీసులతో కలిసి తన భర్త డబ్బులు ఇవ్వకుండా కోర్టు ఆదేశాలను పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పటికైనా తనకు న్యాయం జరిగేలా చూడాలని లేదంటే ఆత్మహత్యే శరణ్యం అని వాపోయింది శ్రీలత రెడ్డి.