ఏదో సినిమాలో తాను బతికుండగానే చచ్చిపోయినట్లు నాటకం ఆడించి.. పంచాయతీ పెద్దల నుంచి డబ్బులు, పొలం నొక్కేస్తాడు బాబూమోహన్. దీనికి భార్య సహకారం కూడా తీసుకుంటాడు. అది రీల్ సీన్. కానీ.. కాస్త అటూ ఇటూగా రియల్ గా జరిగింది. కాకపోతే ఇక్కడ కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా భార్యదే. భర్తకు ఏం తెలియదు.
జీహెచ్ఎంసీ పరిధిలోని జగద్గిరిగుట్ట ధరణీ నగర్ లో భర్త బతికుండగానే వితంతు పెన్షన్ తీసుకుంటోంది ఓ మహిళ. మూడేళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది. తాను బతికుండగా భార్యకు అధికారులు విడో పెన్షన్ ఎలా ఇస్తున్నారని.. అసలు ఏం జరిగింది..? ఏం జరుగుతోంది.. నాకు తెలియాలి.. అంటూ సినిమా డైలాగులు వినిపించాడు భర్త. అధికారులు దీనిపై సమాధానం చెప్పాలని అంటున్నాడు.
ఈ సంఘటనతో అధికారుల అలసత్వం, సోమరితనం మరోసారి బయటపడింది.