అక్కినేని నాగార్జున హీరోగా సోల్మన్ దర్శకత్వంలో శుక్రవారం విడుదలైన సినిమా వైల్డ్ డాగా. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రంలో నాగార్జున సరసన దియామీర్జా నటించారు. ఎన్.ఐ.ఏ అధికారిగా నాగ్ నటించగా, ఉగ్రవాద కథ నేపథ్యంలో వచ్చిన సినిమా కావటంతో సినిమా ఎలా ఉంటుందని అభిమానులు ఎదురు చూశారు.
ప్రపంచ వ్యాప్తంగా వైల్డ్ డాగ్ 8.10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా… ఫస్ట్ డే మంచి కలెక్షన్లే రాబట్టింది.
తొలిరోజు ఈ సినిమా 1.33 షేర్ లు, 2.60 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.21 కోట్ల షేర్, 2.35 కోట్ల గ్రాస్ వసూళ్లు నమోదయ్యాయి. నైజాం- 53 లక్షలు, సీడెడ్- 19 లక్షలు, ఉత్తరాంధ్ర- 16 లక్షలు, ఈస్ట్ గోదావరి- 7 లక్షల కలెక్షన్స్ సాధించింది.