naవడోదరా: పది అడుగులకు పైగా వున్న కొండచిలువను శనివారం గుజరాత్‌లో వైల్డ్‌లైఫ్ రెస్క్యూ అధికారులు పట్టుకున్నారు. వడోదరకు చెందిన వ్యక్తి వ్యవసాయ పనుల కోసం తన పొలానికి వెళ్ళగా అక్కడ అతనికి ఏదో అలికిడయిన శబ్దం వినిపించింది. చెట్ల పొదల్లోకి తొంగి చూడగా కొండచిలువ కనిపించింది. వెంటనే వైల్డ్ లైఫ్ రెస్క్యూకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని పొదలను తొలగించి 10 అడుగుల కొండచిలువను బయటికి తీశారు. తర్వాత ఆ కొండచిలువను తీసుకెళ్లి అడవిలో వదిలేశారు.