సహజంగా పెళ్లి అంటే అమ్మాయి, అబ్బాయిలు మెడలో పూలదండలు వేసుకుంటారు. దండలు మార్చుకుంటే ఆల్ మోస్ట్ పెళ్లి అయిపోయినట్టే అంటారు పెద్దలు. కానీ.. ఓ నూతన దంపతులు మాత్రం వినూత్నంగా దండల ప్లేస్ లో పాములను మెడలో వేసుకొని అందరిని ఆశ్చర్యానికి గురిచేశారు. ఈ వింత ఘటన మహారాష్ట్రలో జరిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మహారాష్ట్రలోని బీడ్ జిల్లాకు చెందిన సిద్ధార్థ్ సోనావానే, సృష్టి ఔసర్మాల్ లు..వైల్డ్ లైఫ్ ఆఫీసర్స్. కాగా.. వాళ్లిద్దరూ 2010 నవంబర్ 12న పెళ్లి చేసుకున్నారు. అసలే వన్యప్రాణి సంరక్షణ అధికారులు. పూలదండలు మార్చుకుంటే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో కానీ.. పాములనే దండలుగా మార్చుకున్నారు.
వధువు సృష్టి ఔసర్మాల్ వరుడికి ఓ చిన్నపామును దండకు బదులు వరుడి మెడలో వేసింది. దీంతో ‘నేనేం తక్కువ’ అంటూ వరుడు ఏకంగా పైథాన్ నే వధువు మెడలో దండగా వేశాడు. దీంతో ఆ వివాహానికి వచ్చిన బంధువులంతా ఆశ్చర్యానికి గురయ్యారట. అంతేకాదు.. కొందరైతే ఆ సర్పాలను చూసి భయంతో వణికిపోయారట. వివాహం అనంతరం వాటిని అడవిలో వదిలేశారట.
అయితే.. ఆ సమయంలో తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు స్పందించారు. ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది.. కానీ ఆ పాములు కాస్త వైల్డ్ గా రియాక్ట్ అయి ఉంటే ఏమయ్యేది..? అని కొందరు కామెంట్ పెడుతుంటే.. ఎంత వైల్డ్ లైఫ్ ఆఫీసర్స్ అయితే మాత్రం ఇంత వైలెన్స్ అవసరమా అంటూ ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.