అటు బాలీవుడ్ లో కానీ.. ఇటు టాలీవుడ్ లో కానీ వారుసుల రంగ ప్రవేశం అనేది ఎప్పటి నుంచో ఉంది. అది అందరికీ తెలిసిందే. అభిమానులు కూడా తమ హీరోల పిల్లలు ఎప్పుడూ సినీ రంగ ప్రవేశం చేస్తారా అనే ఆసక్తితో ఎదురు చూస్తుంటారు కూడా.
తాజాగా బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ కుమారుడు ఆరవ్ ఎంట్రీ ఎప్పుడంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్షయ్ నటించిన సెల్ఫీ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆయన కుమారుడి సినీ ప్రవేశం గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు.
దానికి సమాధానంగా అక్షయ్.. ”ఉస్కో షౌక్ నహీ హై” అంటూ బదులిచ్చారు. మీ సినీ వారసత్వాన్ని మీ కొడుకు ముందుకు తీసుకుని వెళ్లడం ఇష్టం లేదా అని మరొకరు ప్రశ్నించగా.. దానికి ఆయన “మై బాస్ చాహ్తా హు కే వో ఖుష్ రహే (నా కొడుకు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను)” అంటూ బదులిచ్చాడు.
శుక్రవారం అక్షయ్ సెల్ఫీ చిత్రంతో థియేటర్లలో కనిపించనున్నాడు. ఈ చిత్రం మలయాళ బ్లాక్ బస్టర్ డ్రైవింగ్ లైసెన్స్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మానుషి చిల్లర్, ఆలయ ఎఫ్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు.