ముంబై ఇండియన్స్.. ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ విజేత. కానీ ఐపీఎల్-2022 సీజన్ లో పేలవమైన ఆటతీరు ప్రదర్శిస్తోంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ ఐదు మ్యాచ్ లు ఆడింది. ఆడిన అన్ని మ్యాచ్ ల్లోనూ ఆ జట్టు పరాజయం పాలైంది.
తదుపరి మ్యాచ్ లో లక్నో సూపర్ జియాంట్స్ జట్టుతో ముంబై జట్టు శనివారం తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ లో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ ను ఆడించే విషయంపై ఆలోచిస్తున్నట్టు ముంబై ఫ్రాంఛైజీ హింట్ ఇచ్చింది.
ఈ మేరకు ముంబై ఫ్రాంచైజీ ఓ ట్వీట్ చేసింది. ట్వీట్ లో అర్జున్ పేరుతో హ్యాష్ ట్యాగ్ చేసింది. లక్నోతో జరగబోయే మ్యాచ్ కు ఈ ప్లాన్ అమలు చేసే విషయం మా మనసులో మెదులుతోందని ట్వీట్ లో ఫ్రాంచైజీ వెల్లడించింది.
ఈ ట్వీట్ పై సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ స్పందించారు. ట్వీట్ కు 10 హార్ట్ సింబల్స్ పెట్టి ఆమె తన ఫీలింగ్ ను వ్యక్త పరిచారు. అర్జున్ అరంగేట్రంపై తాను సంతోషంగా ఉన్నట్టు ఆమె ఆ సింబల్ ద్వారా చెప్పారు.