బీజేపీ నేతలు మరోసారి సంచలన ప్రకటన చేశారు. హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మార్చి తీరతామంటూ బీజేపీ సీనియర్ నేత మురళీధర్ రావు కామెంట్ చేశారు.
ఆదివారం హైదరాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో భారత్ నీతి సంస్థ ఆధ్వర్యంలో జరిగిన డిజిటల్ హిందూ కాంక్లేవ్ లో పాల్గొన్ మురళీధర్ రావు… హైదరాబాద్ పేరు మార్చే విషయంలో తమను ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. కేవలం పేరు మార్పే తమ ఉద్దేశం కాదని… సైద్ధాంతిక మార్పు కూడా తమ ఉద్దేశమన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో కూడా మద్దతు కూడగడతామన్నారు. పేరు మార్పు ఎంత అవసరమో అవగాహన కలిగిస్తామంటూ ఆయన కామెంట్ చేశారు. దేశంలో ప్రజాస్వామ్యం బలంగా ఉందని మేధావులు అభిప్రాయ పడుతున్నారని, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు.