స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మనకు కొన్ని సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. అందులో ఒకటి చార్జింగ్ ఏ మాత్రం నిలవకపోవడం. ఫోన్ రెండు గంటలు సరిగా వాడితే చార్జింగ్ ఆగని పరిస్థితి. అయితే ఫోన్ బ్యాటరీ సేవ్ చేసుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి డార్క్ మోడ్. దీనితో బ్యాటరీ సేవ్ అవుతుందా అనే అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. అయితే ఆగుతుందా లేదా అనేది మన ఫోన్ డిస్ప్లే ప్యానల్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
Also Read:సీనియర్ హీరో రెండో పెళ్లి?
మన ఫోన్ డిస్ప్లేలు ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి LCD మరియు LED. LCD డిస్ప్లేలలో పూర్తిగా బ్లాక్ స్క్రీన్ చూపించడం సాధ్యం కాదు. మన స్క్రీన్ మీద ఒకే భాగంలో బొమ్మ కనిపించాలన్నా సరే మొత్తం స్క్రీన్ పని చేయాల్సి ఉంటుంది. మొత్తం స్క్రీన్ పనిచేయాల్సిఉంటుంది. కానీ LED డిస్ప్లే మాత్రం వేరుగా ఉంటుంది. స్క్రీన్ మీద ఏ భాగంలో అయితే నలుపు రంగు ఉంటుందో ఆ భాగం పని చేసే అవసరం లేదు.
డార్క్ మోడ్ ఆన్ చేసినప్పుడు చాలా వరకు మన స్క్రీన్ నల్లగా ఉంటుంది. దీనితో ఇక్కడ చార్జింగ్ సేవ్ అవుతుంది. మీ ఫోన్ ప్యానల్ LED ప్యానల్ అయి ఉంటే డార్క్ మోడ్ తో బ్యాటరీ ఎక్కువ సమయం వస్తుంది. LCD ప్యానల్ అయితే మాత్రమం ఏ మోడ్ అయినా ఒకటే అంటున్నారు నిపుణులు. శాంసంగ్ ఫోన్లలో sAMOLED ప్యానల్ ఇచ్చారు. ఇది ఒకరకమైన LED ప్యానల్.
Also Read:వేసవి సెలవులు తీసుకుంటున్న మహేష్ బాబు