వరుస అవకాశాలతో దూసుకుపోతున్న అందాల భామ పూజా హెగ్డే. తాజాగా మనబుట్టబొమ్మలిష్టులోకి మరో మూవీ వచ్చి చేరింది. తమిళ హీరో ఆర్యతో జోడి కట్టబోతోంది ఈ జిగేల్ రాణి.
పదమూడేళ్ల క్రితం కార్తి హీరోగా నటించిన ‘ఆవారా’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు లింగుస్వామి దీనికి సీక్వెల్ ప్లాన్ చేశాడు. ఈసారి కార్తి కాకుండా ఆర్య హీరోగా నటించబోతున్నాడు.
అతనికి జంటగా పూజా హెగ్డే నటించనుందనే ప్రచారం కోలీవుడ్‌లో జరుగుతోంది. లింగుస్వామి చెప్పిన స్టోరీకి పూజ కనెక్ట్ అయ్యిందని,సో సీక్వెల్‌కు సై అందనే వార్తలు వినిపిస్తున్నాయి.
దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తీస్తున్న చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌లో జాయిన్ కానుంది. మరోవైపు.. సల్మాన్ ఖాన్‌తో కలిసి పూజ నటించిన ‘కిసి కా భాయ్..కిసి కి జాన్’ ఏప్రిల్ 21న రిలీజ్ కానుంది.