ఊహించని విధంగా డేంజరస్ (తెలుగులో మా ఇష్టం అనే టైటిల్) సినిమా విడుదల నిలిచిపోయింది. లెస్బియన్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాను విడుదల చేయమంటూ కొంతమంది ఎగ్జిబిటర్లు స్వచ్ఛందంగా తప్పుకోగా.. మరికొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తామంటూ కొన్ని వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో డేంజరస్ సినిమా రిలీజ్ ఆగిపోయింది.
దీనిపై భగ్గుమంటున్నాడు వర్మ. ఎలాగైనా తన సినిమాను సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకొస్తానని గట్టిగా చెబుతున్నాడు ఈ దర్శకుడు. నిజానికి ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడం వర్మకు చిటికెలో పని. ఆయన దగ్గరే ఓ ఓటీటీ వేదిక ఉంది. బయట కొన్ని మరికొన్ని ఓటీటీ సంస్థలు, ఆర్జీవీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి.
కానీ వర్మ మాత్రం డేంజరస్ చిత్రాన్ని థియేటర్లలోనే రిలీజ్ చేస్తానంటున్నాడు. అవసరమైతే దీనిపై న్యాయపోరాటం చేస్తానంటున్నాడు. మరోవైపు ఈ సినిమాలో నటించిన హీరోయిన్లపై కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇందులో ఆర్జీవీ హాట్ ఫేవరెట్ గర్ల్స్ నైనా గంగూలీ, అప్సర రాణి లీడ్ రోల్స్ పోషించారు. వీళ్లిద్దరితో విడివిడిగా గతంలో సినిమాలు చేశాడు వర్మ. ఇప్పుడీ లెస్బియస్ మూవీ కోసం ఇద్దర్నీ ఒకే తెరపైకి తీసుకొచ్చాడు. వీళ్లతో ఓ రేంజ్ లో అందాలు ఆరబోయించాడు. వీళ్లు కూడా వర్మ ఊహించిన దానికంటే కాస్త ఎక్కువగానే తెరపై అందాలు పరిచారు. ఇప్పుడీ అందాలన్నీ తెరపైకి రాకుండా పోయేలా ఉన్నాయి. ఓటీటీకే పరిమితమయ్యేలా కనిపిస్తున్నాయి. వర్మ ఈ సినిమాను ఏ దరికి చేరుస్తాడో చూడాలి. కష్టపడి థియేటర్లలో రిలీజయ్యేలా చేస్తాడా లేక ఎప్పట్లానే లైట్ తీసుకొని ఓటీటీలో పడేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.