కందిరీగ సినిమాతో హిట్ దర్శకుల లిస్టులో చేరిపోయిన డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్. అప్పుడే కందిరీగకు సీక్వెల్ గా కందిరీగ-2 చేయాలని భావించినా ఆ ప్రయత్నం విఫలం అవుతూ వచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్ తో సినిమా బెడిసికొట్టడంతో కందిరీగ-2 అలా పక్కకు వెళ్లిపోయింది.
అయితే, సీక్వెల్ ను ముట్టుకోకుండా హీరో రామ్ తో హైపర్ చేశాడు డైరెక్టర్. ఇప్పుడు అల్లుడు అదుర్స్ తో రాబోతున్నాడు. ఈ సినిమాపై కాన్ఫిడెంట్ గా ఉన్న డైరెక్టర్, ఈ మూవీ తర్వాత కందిరీగ-2 తీయాలని డైరెక్టర్ భావిస్తున్నాడు. పైగా రెడ్ మూవీ తర్వాత హీరో రామ్ కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు.
దీంతో కందిరీగ-2 ను 2022లో అయినా సెట్స్ పైకి తీసుకరావాలని ప్లాన్ చేస్తున్నారు.