జలంతర్గాముల విషయంలో చైనా వేస్తున్న అడుగులు ఇతర దేశాలకు మేలు కొలుపుగా మారాల్సి వచ్చేలా ఉంది. చైనా దూకుడుగా తన నేవీ వ్యవస్థను బలోపేతం చేసుకుంటుంది. ముఖ్యంగా తూర్పు ఆసియాలో గత 20 సంవత్సరాలుగా చైనా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. ముఖ్యంగా 2000 సంవత్సరం వరకు చైనా-అమెరికా సంబంధాల రేషియా 1:11గా ఉండగా, ప్రస్తుతం అది 1:3 కి పడిపోయింది.
కానీ అదే సమయంలో తైవాన్ వంటి దేశాలు చాలా ముందుకు వెళ్లిపోయాయి. అయితే, వారి వారి దేశాల సమస్యల నేపథ్యంలో ఒక్కో దేశం ఒక్కో నిర్ణయం తీసుకుంటూ వెళ్తున్నాయి. కానీ చైనా అంత ఎక్కువగా ఏ దేశం తన నేవీ సంపత్తిని పెంచుకోలేకపోయింది. చైనా గత 30 సంవత్సరాలుగా నేవీపై దృష్టిపెడుతూ రాగా… ఇప్పుడు పాత వాటి స్థానంలో కొత్త షిప్ లను తీసుకొస్తుంది. మిగతా యూరోపియన్ దేశాలు ఇండో పసిఫిక్ రీజియన్ లో తమ బలాన్ని కాపాడుకుంటున్నాయి. ఈ దేశాలన్ని ఇప్పటి వరకు అమెరికా అనే గొడుగు కిందే ఉంటూ వచ్చాయి. కానీ తైవాన్ వంటి దేశాలు ఇప్పుడు అమెరికాను గుడ్డిగా నమ్మటం లేదు.
కానీ ఇప్పటికీ ఈ విషయంలో అమెరికాయే ప్రథమ స్థానంలో ఉంటుంది. కాకపోతే చైనా తన వ్యవస్థను వేగంగా మెరుగుపర్చుకుంటూ వస్తుంది. కానీ దీనిపై అమెరికా వైట్ హౌజ్ మాత్రం పెద్దగా పట్టించుకోవటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడికి సరైన ఫీడ్ బ్యాక్ ఇవ్వటం లేదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే, అమెరికా సహయంతో ఆస్ట్రేలియా కీలక అడుగులు వేస్తోంది. న్యూక్లియర్ దాడులను చేయగల క్షిపణి వ్యవస్థలను ఆస్ట్రేలియా మెరుగపర్చుకుంటుంది. చైనా ఆదిపత్యానికి గండి కొట్టేందుకే ఈ నిర్ణయమని కనపడుతుంది. దీంతో వచ్చే 20 ఏళ్లలో ఈ ఆధిపత్య పోరు మారబోతుందనేందుకు ఇది సంకేతమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే, ఇండియా కూడా ఇప్పటికే డిఫెన్స్ రంగంకు కేటాయింపులు పెంచుతున్నా… చైనాతో పోల్చితే శక్తి సామార్థ్యాలను పెంచుకోవాల్సి ఉంది. ఇండియా పాత షిప్ లను అప్ గ్రేడ్ చేయటంపైనే దృష్టిపెట్టింది. నిర్భయ్ వంటి క్షిపణి వ్యవస్థలను తయారు చేస్తున్నా ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది. ఉపరితలం నుండి దాడులు చేయగల క్షిపణి వ్యవస్థలే కాదు నేవీ ఉపరితలం నుండి దాడులు చేసే సామర్థ్యాలను ఇంకా డెవలప్ చేసుకోవాల్సి ఉంది. అలా అయితే హిందూ మహాసముద్రంలో భారత్ తన ఆధిపత్యాన్ని కాపాడుకోగలుగుతుందని అంటున్నారు.
ఇవన్నీ జరగాలన్నా, చైనా దూకుడుకు అడ్డుకట్ట పడాలన్నా…. అమెరికాతో జతకట్టాల్సిన అవసరం ఉందనేది నిపుణుల వాదన.