విమానం నడపడం అనేది కనపడే అంత సులువు కాదు. చాలా జాగ్రత్తగా నడపాల్సి ఉంటుంది. వాతావరణ పరిస్థితిని కూడా అర్ధం చేసుకుని విమానం నడపాల్సి ఉంటుంది. అయితే చాలా మందికి ఉండే సందేహం విమానం పై వర్షం పడుతుందా అనేది. అసలు విమానంపై వర్షం పడుతుందా లేదా అనేది చూద్దాం.
Also Read:ప్లీనరీ సమావేశం.. ప్రతినిధులకు దిశానిర్ధేశం
విమానాలు దాదాపు ఎక్కువ శాతం తేమ, వర్షం, ఐస్ పదార్దాలు ఉన్న మేఘాలలోకి వెళ్ళే అవకాశాలు ఉండవు. మేఘాలలోకి వెళ్లకుండా ఫ్లైట్ పాత్ ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు. వాతావరణ నిపుణుల సూచన మేరకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ పైలెట్స్ కి విమానం దట్టమైన మేఘాలలోకి వెళ్లకుండా ఆదేశాలు ఇస్తే ఆ ఆదేశాల ప్రకారం నడుచుకుంటారు. పైలెట్స్ కేబిన్ లో ఉన్న రాడార్ సహాయం తో పైలెట్స్ విమానం దట్టమైన మేఘాలలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తారు.
ఒకవేళ మేఘాలపై నుండి వెళితే వర్షం విమానం మీద కురిసే అవకాశాలు ఉండవు. ఒకవేళ కొన్ని అనివార్య పరిస్థితుల్లో మేఘాలలో విమానం చిక్కుకున్నప్పుడు, తప్పకుండ ఆ మేఘాలలో ఉన్న వర్షపు నీళ్లను, ఐస్ పదార్దాలను, టుర్బులెన్సు ను విమానం ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. మేఘాలలో ఉండే ఐస్ పదార్దాలు కొన్ని సార్లు ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ కు కారణమైయి పిడుగులకు కూడా కారణంగా మారతాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో విమానాన్ని అదుపులో పెట్టడానికి అనుభవమున్న పైలెట్స్ అవసరం ఎక్కువగా ఉంటుంది. మేఘాలు ఉండే అవకాశం ఉంటే మాత్రం అనుభవం ఉన్న పైలెట్ నే పంపుతారు.
Also Read:కావాలనే అవమానించారు..!