టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి తర్వాత కూడా బిజీగా గడుపుతున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. యువ హీరోలకు అక్క పాత్రలు కూడా ఆమె చేసే అవకాశం ఉంది. తమిళంలో రెండు మూడు సినిమాలు ఆమె సంతకం చేసినట్టు తెలుస్తుంది. ఇక బాలీవుడ్ లో ఒక వెబ్ సీరీస్ లో ఆమె నటించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమెకు రెండు తెలుగు సినిమాల అవకాశాలు వచ్చాయి.
అందులో నందమూరి బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఒకటి. ఈ సినిమాలో ఆమెను ఎంపిక చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. దీనికి సంబంధించి నటన ప్రాధాన్యత ఉండే విధంగా పాత్ర సిద్దం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఇందుకోసం ఆమె బరువు కూడా తగ్గే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాకు పారితోషికం కూడా బాగానే డిమాండ్ చేస్తుంది.
ఈ సినిమాలో నటించేందుకు ఆమె దాదాపుగా నాలుగు కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సినిమా బడ్జెట్ ఎక్కువ కావడంతో ఆమె కూడా ఎక్కువగానే అడుగుతున్నారు అని అంటున్నారు. ఇక ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా నటించే అవకాశం ఉందని సమాచారం.