ఫాంహౌజ్‌ నుండి ఇక కేసీఆర్‌ పాలన? - Tolivelugu

ఫాంహౌజ్‌ నుండి ఇక కేసీఆర్‌ పాలన?

Will Kcr To Rule the Govt From Farmhouse, ఫాంహౌజ్‌ నుండి ఇక కేసీఆర్‌ పాలన?

కేసీఆర్ పాలన సెక్రటేరియట్ నుండి ప్రగతి భవన్ సీఎం క్యాంప్ ఆఫీస్ కు మారింది. జనం క్రమంగా సచివాలయంను మరిచిపోయేలా చేసాడు. ఇప్పుడు కొత్త సచివాలయం నిర్మాణం పేరుతో ఇప్పటిదాకా ఉన్న సెక్రటేరియట్ ను ఖాళీ చేసి బూర్గుల రామకృష్ణయ్య భవన్ కు మార్చారు. అక్కడికి కూడా అన్ని శాఖలు, మంత్రులు అందరూ వెళ్ళలేదు. కొన్ని శాఖలు కొందరు మంత్రులు మాత్రమే వెళ్లారు. దానితో సచివాలయంకు ఉండే స్వరూపం లేకుండా పోయింది.

సెక్రటేరియట్ లో పనిమీద వచ్చిన వాళ్ళు ఒకే చోట కేంద్రీకృతంగా అన్ని శాఖల హెచ్ డి ఓ లు, ముఖ్య కార్యదర్శులు లేకపోవడం వలన వివిధ పనుల మీద వచ్చిన వాళ్ళు వివిధ ప్రాంతాలలో ఉండే కార్యాలయలకు వెళ్లి అధికారులను కలుసుకోవడం చాలా ఇబ్బంది గా మారింది. వచ్చిన పనులు చేసుకోవాలంటే కనీసం రెండు మూడు రోజులు హైదరాబాద్ లో ఉండాల్సిన పరిస్థితి. దీంతో సామాన్యులకు ఆర్దికంగా భారంగా అవుతోంది. పనులు కాక జనం నానా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితి ఎప్పుడు పోతుందో అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రం ఏర్పడ్డకా కేసీఅర్ ముఖ్యమంత్రి అయ్యాక సచివాలయంకు రావడం క్రమంగా మానేశారు. ముఖ్యమంత్రి సెక్రటేరియట్ కు రాకపోవడం దానితో మంత్రులు కూడా రెగ్యులర్ గా రావడంలేదు. దీనికి తోడు ఇప్పుడు సచివాలయం మార్చడం అన్ని శాఖలు ఒక్కచోట లేకుండా పోవడంతో పరిస్థితి దారుణంగా తయారై, పాలన కుంటుపడింది. ఏ ఫైల్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో తెలియడంలేదు.

తాజాగా వస్తున్న వార్తలను వింటుంటే కేసీఅర్ పాలన ఇక నుండి ఎర్రవల్లి ఫాంహౌస్ నుండి సాగుతుంది అంటున్నారు .అందుకే పాత నిర్మాణాలను కూల్చి విశాలంగా అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహించుకోవడం కోసం, అలాగే మంత్రులు ప్రజాప్రతినిధులు వస్తే కూర్చుని మాట్లాడుకోవడానికి వీలుగా, అవసరం అయితే అందరూ కలసి లంచ్ చేయడానికి తగట్టుగా అన్ని వసతులు ఉండే విధంగా నిర్మాణాలు చేస్తున్నారని చెపుతున్నారు. అదే జరిగితే సామాన్యుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా ఉంటుంది. పాలన అటకెక్కినట్లే.

ఇలాంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ కనపడవు. నేను సెక్రటేరియట్ కు రాకపోయినా ఎవరిని కలవకపొయినా రోజుల తరబడి ఫైల్స్ చూడకపోయినా నేను ఎలా ఉన్నా ఏమిచేసినా ప్రజలు నామీద ఆగ్రహంగా లేరు, వాళ్ళు కోపంగా ఉంటే నాకు ఎందుకు ఓట్లు వేస్తారు, ఏ ఎన్నిక జరిగినా టీఆర్ఎస్ గెలుస్తుంది అనే భావనతో కేసీఅర్ ఉన్నారు. అయితే ఈ పరిస్థితి ఎప్పటికీ ఇలానే ఉండదు. ప్రజలు విజ్ఞులు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తారు. అప్పుడు కాని అర్దం కాదు పాలకులకు. అప్పటిదాకా ప్రజలు మాతోనే ఉన్నారు, మేము ఎదిచేసినా వాళ్ళు అంగీకరిస్తున్నారని అనుకుంటూ కూర్చుంటారు. అధికారం పోయాక కాని తెలియదు ప్రజల రీయాక్షన్ ఏమిటో.. అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Share on facebook
Share on twitter
Share on whatsapp