వన్డేల్లో ఓడి తీవ్ర విమర్శల పాలయిన కోహ్లి సేన… టీ20ల్లో మాత్రం తన ప్రతాపాన్ని చూపిస్తుంది. 3టీ20ల సిరీస్ ను ఇప్పటికే 2-0తో గెలుచుకున్న భారత్, నామమాత్రపు 3వ టీ20లో కూడా గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేస్తుందా? అన్నది ఆసక్తిగా మారింది.
2016లోనూ ఆసీస్ పర్యటనకు వెళ్లిన టీమ్ఇండియా వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయి, టీ20 సిరీస్‌ను 3-0తో చేజిక్కుంచుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్‌లో అలానే ఓడిపోగా, టీ20 సిరీస్‌లో 2-0తో ఆధిక్యంలో ఉంది. ఒకవేళ చివరి మ్యాచ్ కూడా గెలిస్తే అప్పటి సీన్ రిపీట్ అవుతుంది!
భారత కీలక ఆటగాళ్లు… రోహిత్ శర్మ, బుమ్రా లాంటి స్టార్స్ లేకపోయినా సరే సిరీస్ గెలిచామని రెండో టీ20 అనంతరం కెప్టెన్ కోహ్లీ చెప్పాడు. అందుకు తగ్గట్లుగానే తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ సమష్టి ప్రదర్శన చేసిన జట్టు ఆసీస్‌పై విజయం సాధించింది. అయితే, చివర్లో ఒత్తిడిని తట్టుకొని పాండ్యా, జడేజా జట్టు భారాన్ని మోస్తుండగా… మూడో మ్యాచ్ లో కొత్త కుర్రాళ్లు మెరుస్తారా చూడాలి.