నాగచైతన్య-సమంత విడిపోయారు. తామిద్దరం విడిపోయామనే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎవరి దారులు వాళ్లు చూసుకున్నారు. ఎవరి సినిమాలు వాళ్లు చేసుకుంటున్నారు. అయితే ఓ సెక్షన్ మీడియా మాత్రం ఇంకా ఈ టాపిక్ ను వదల్లేదు. ఇటు సమంతపై, అటు నాగచైతన్యపై ఎప్పటికప్పుడు వీడియోలు, కథనాలు, కట్టుకథలు, గాసిప్స్ అల్లుతూనే ఉంది.
నాగచైతన్య-సమంత మళ్లీ కలిసిపోతున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో కథనాలు వచ్చాయి. మరికొన్ని ఛానెళ్లు మరో అడుగు ముందుకేసి, నాగచైతన్య రెండో పెళ్లికి రెడీ అంటూ హెడ్డింగులు పెట్టేశాయి. ఈ మొత్తం వ్యవహారంపై నాగచైతన్య టీమ్ మరోసారి స్పందించింది.
ప్రస్తుతం నాగచైతన్య తన సోలో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడట. మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా ప్రస్తుతానికి అతడికి లేదని చెబుతున్నారు. ఎందుకంటే, వరుస సినిమాలతో నాగచైతన్య బిజీగా ఉన్నాడు. హలో సినిమా షూటింగ్ పూర్తిచేశాడు. ప్రస్తుతం దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. ఇది కంప్లీట్ అయిన వెంటనే వెంకట్ ప్రభు దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేస్తాడు.
ఇలా బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న నాగచైతన్య, ప్రస్తుతం రెండో పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేసింది అతడి టీమ్. ప్రైవసీని ఎక్కువగా ఇష్టపడే నాగచైతన్య.. మళ్లీ పెళ్లి చేసుకుంటే ఎవర్ని చేసుకుంటాడు, ఎప్పుడు చేసుకుంటాడు లాంటి విషయాలు బహుశా.. అతడి టీమ్ కు కూడా తెలియకపోవచ్చు.