పంజాబ్ కాంగ్రెస్ కు ఆ పార్టీ మాజీ నేత, సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నాలుగున్నర సంవత్సరాల అమరీందర్ సింగ్ పాలన వల్లే తమ పార్టీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిందన్న కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
వారి మాటలు నిజమైతే.. యూపీలో కాంగ్రెస్ ఓటమికి కారణం ఎవరు? మణిపూర్, గోవా, ఉత్తరాఖండ్ సంగతేంటి ? అని ఆయన ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఓటమి నుంచి పాఠాలు ఎప్పుడూ నేర్చు్కోలేదని అన్నారు.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో శుక్రవారం కాంగ్రెస్ ఘోర పరాజయం పాలైంది. ఈ ఎన్నికల్లో 92 స్థానాల్లో విజయంతో అధికారం చేజిక్కిచ్చుకోగా, కాంగ్రెస్ 18 స్థానాలకు పరిమితమైంది.
కాంగ్రెస్ ఓటమిపై ఆ పార్టీ నేత రణదీప్ సింగ్ సూర్చేవాలా మాట్లాడుతూ… అమరీందర్ పాలన వల్లే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందన్నారు. అందుకే తమ పార్టీ ఓటమి పాలైందన్నారు.