ముస్లింల ప్రతిష్ఠను దెబ్బ తీసేలా కాషాయ పార్టీ వ్యవహరిస్తోందని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. హర్యానాలో భివానీలో జునైద్, నాసిర్ ల హత్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. వారి హత్యలకు హిందూ రాజ్యస్థాపనను విశ్వసించే వారే బాధ్యత వహించాలన్నారు.

హర్యానాలోని భివానిలో ఇద్దరు ముస్లిం యువకులను బజరంగ్‌దళ్ కార్యకర్తలు హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో బీజేపీపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గోరక్షకులను బీజేపీ కాపాడుతోందని ఆయన ఆరోపించారు. ముస్లిం యువకుల హత్యోదంతంలో హర్యనా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ఆయన మండిపడ్డారు.
యువకులను గోరక్షక ముఠాగా చెప్పుకుంటున్న వారు హత్య చేస్తే వారిని బీజేపీ, ఆరెస్సెస్‌లు సమర్ధిస్తున్నాయని ఆయన ఆరోపణలు గుప్పించారు. దేశంలో వ్యవస్ధాగతంగా ముస్లింలపై విద్వేషాన్ని వ్యాపింపచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.
నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని తాను మోడీ సర్కార్ ను అడగాలని అనుకుంటున్నానని చెప్పారు. గోరక్షకులుగా చెప్పుకుంటున్న వారు ప్రజలను బలిగొంటున్నారని ఆయన అన్నారు. అలాంటి వారిని బీజేపీ ప్రోత్సహిస్తోందన్నారు.
రాజస్ధాన్‌లోని భరత్‌పూర్‌కు చెందిన నాసిర్ (25), జునైద్ అలియాస్ జునా (35)లను దుండగులు బుధవారం అపహరించారు. ఆ మరుసటి రోజు వారిద్దరి మృతదేహాలు భివానీలోని లాహోర్ వద్ద లభించాయి. వారి మరణానికి బజరంగ్ దళ్ గోరక్షకులుగా చెప్పుకుంటున్నవారు వారిని అపహరించారని ఆరోపణలు ఉన్నాయి.