సెప్టెంబర్ 17న తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బలప్రదర్శనకు రెడీ అయ్యాయి. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న ఈ రెండు పార్టీలు పోటాపోటీగా సభ నిర్వహిస్తున్నాయి. బీజేపీ నిర్మల్ లో సభకు రెడీ కాగా, అదే రోజు కాంగ్రెస్ పార్టీ సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్ లో సభ పెట్టింది.
అయితే, ముందు నుండి చెప్తున్నట్లుగానే నిర్మల్ సభకు కేంద్రమంత్రి అమిత్ షాను తీసుకరావటంలో బీజేపీ సక్సెస్ అయ్యింది. అధికారికంగా అమిత్ షా టూర్ ఫిక్స్ అయ్యింది. మరోవైపు సెప్టెంబర్ 17 సభకు రాహుల్ గాంధీని రప్పించాలని కాంగ్రెస్ ట్రై చేస్తుంది. నిజానికి ఈ సభను వరంగల్ లో పెట్టాలనుకున్నారు. కానీ గజ్వేల్ కు షిఫ్ట్ చేశారు. దీంతో రాహుల్ ను గజ్వేల్ సభకు ఆహ్వానించేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆద్వర్యంలో ఓ టీం ఢిల్లీ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో రాహుల్ ఓకే అంటారా… తర్వాత చూద్దాంలే అని వాయిదా వేస్తారా అన్న ఆసక్తి నెలకొంది.
Advertisements
ఒకవేళ రాహుల్ కూడా సెప్టెంబర్ 17న తెలంగాణ టూర్ కు వస్తే మాత్రం పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరగనుంది. ప్రత్యామ్నాయం మేమే అని చెప్పుకుంటున్న ఈ రెండు జాతీయ పార్టీల్లో ఎవరు సక్సెస్ అవుతారో చూడాలి.