కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా రిలీజ్ అవుతుందా లేదంటే హైకోర్టు రిలీజ్ ను అడ్డుకుంటుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాలో తనను అవమాన పరిచే విధంగా పాత్ర చిత్రీకరణ ఉందని కెఏ పాల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈరోజు విచారణ జరిగింది. వ్యక్తిగతంగా అవమానపరిచేలా పాత్ర చిత్రీకరణ ఉందని, అదే విధంగా ట్రైలర్ లో చూపించారని పిటిషన్లో పేర్కొన్నారు.
కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాకి A సర్టిఫికేట్ ?
దీంతో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి రివ్యూను ఇవ్వాలని నిర్మాతలను కోర్టు ఆదేశించింది. ఇంకా సినిమాకు సెన్సార్ కాలేదని, సెన్సార్ పూర్తికాగానే రివ్యూను అందిస్తామని కోర్టుకు నిర్మాతలు తెలియజేశారు. దీంతో కోర్టు దీనికి సంబంధించిన విచారణను రేపటికి వాయిదా వేసింది. సెన్సార్ పూర్తయ్యి రివ్యూ ఇచ్చిన తరువాత, సినిమాను రిలీజ్ అవుతుందా లేదా అన్నది చూడాలి. ట్రైలర్ కు సెన్సార్ ఉండదు కాబట్టి ఎన్నో వివాదాలతో రిలీజ్ చేశారు. సినిమాను ఇలానే రిలీజ్ చేయాలంటే కుదరని పని కదా. చూద్దాం ఏం జరుగుతుందో.
కమ్మరాజ్యంలో కడప రెడ్లు సినిమాకి A సర్టిఫికేట్ ?