ఈ రోజుల్లో హీరోయిన్ల విషయంలో కొన్ని కొన్ని విషయాలు ఆసక్తికరంగా మారాయి. వచ్చిన అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకుంటూ భారీగా సంపాదించే ప్రయత్నం చేస్తున్నారు. ఉప్పెన సినిమా తర్వాత కృతీ శెట్టి పెంచిన భారీ రెమ్యునరేషన్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. కొందరు నిర్మాతలు భయపడే విధంగా హీరోయిన్లు రెమ్యునరేషన్ పెంచడం సీనియర్ హీరోయిన్లు భారీగా డిమాండ్ చేయడం భయపెట్టింది.
ఇప్పుడు కొత్త హీరోయిన్ శ్రీలీల కూడా ఇదే విధంగా డిమాండ్ చేస్తుంది. ఆమె రెండు మూడు సినిమాలకే కోట్లు డిమాండ్ చేయడం ఆశ్చర్యపరిచింది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన కొత్త పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా మారింది ఆమె. ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోగా ఆఫర్లు మాత్రం క్యూ కడుతున్నాయి. మొదటి సినిమాకు ఆమె 25 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంది.
ఇప్పుడు ధమాకాలో 60 లక్షలు ఇచ్చారు. ఈ సినిమా మంచి హిట్ కావడంతో నిర్మాతలు మరో 20 లక్షలు ఆమెకు ఇచ్చారని టాక్. ఇక తర్వాతి ప్రాజెక్ట్ లకు గానూ కోటి నుంచి కోటి 20 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే మాస లో ఆమెకు ఉన్న ఇమేజ్ తో దర్శక నిర్మాతలు ఓకే అంటున్నారని తెలుస్తుంది. తర్వాతి ప్రాజెక్ట్ లు కూడా ఇలాగే హిట్ అయితే ఎంత పెంచేస్తుందో చూడాలి.