ఆర్ఆర్ఆర్ సినిమాపై రోజుకో లీక్ బయటకొస్తోంది. దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే టైమ్ ఉన్న నేపథ్యంలో.. ఈ లీక్స్ గురించి, వాటితో వచ్చిన హైప్ గురించి బ్రీఫ్ గా మాట్లాడుకుందాం.
ఆర్ఆర్ఆర్ సినిమాలో ముందుగా రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుందట. ఇప్పటివరకు వచ్చిన చరణ్ సినిమాల్లోనే ది బెస్ట్ ఎంట్రీ సీన్ అంటున్నారు. అంతేకాదు, ఎన్టీఆర్ కంటే ముందు చరణే సినిమాలో కనిపిస్తాడట. మొన్నటివరకు ఇది పుకారుగా ఉన్నప్పటికీ రాజమౌళి క్లారిటీ ఇచ్చేశాడు. ముందుగా చరణే వస్తాడని చెప్పేశాడు. అంతేకాదు.. చరణ్ ఇంట్రో తీయడానికి తను చాలా కష్టపడ్డానని కూడా వెల్లడించాడు.
ఇక ఈ సినిమాకు సంబంధించి మరో లీక్ చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ కోసం దాదాపు 10-12 రాత్రిళ్లు కష్టపడి, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓ యాక్షన్ బ్లాక్ తీశారట. కానీ ఎడిటింగ్ టేబుల్ మీదకు వచ్చేసరికి, అంత కష్టపడి తీసిన ఆ ఫైట్ ను తీసేశారట. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత దీనిపై క్లారిటీ వస్తుందేమో చూడాలి.
ఇక ఆర్ఆర్ఆర్ లీక్స్ లో ఇంకోటి ఏంటంటే.. సినిమాలో రామ్ చరణ్ కు బ్రిటిషర్లు ఉరిశిక్ష వేస్తారట. అతడ్ని బంధీని చేశారనే విషయాన్ని ఎన్టీఆర్ వెళ్లి, అలియాభట్ కు చెబుతాడంట. అక్కడే ఆమెకు మాట కూడా ఇస్తాడట. రాముడ్ని రక్షించడానికి లక్ష్మణుడు వెళ్తున్నాడని చెబుతాడట. ఈ సీన్ కు సినిమాలో గూస్ బంప్స్ వస్తాయని చెబుతున్నారు. అసలు ఈ సీన్ ఛాయలు సినిమాలో ఉన్నాయో లేదో రేపు తేలిపోతుంది.
ఇక లాస్ట్, బట్ నాట్ లీస్ట్.. ఎన్టీఆర్-పులి ఫైట్. ఈ సీన్ సినిమాలో ఉందని అందరికీ తెలుసు. ట్రయిలర్, టీజర్ లో అది చూపించారు కూడా. అయితే ఆ సందర్భం ఏంటంటే.. బ్రిటిషర్లు ఓ పాప మీదకు పులిని వదులుతారంట. ఎన్టీఆర్ ఆ పాపను రక్షించడంతో పాటు, పులిని ఎలా అదుపులోకి తెచ్చాడనేది ఆ సీన్ అంటున్నారు. ఈ లీక్స్ లో ఎన్ని నిజాలు, ఎన్ని అబద్ధాలో రేపు తేలిపోతుంది.